ఇన్సైడ్ టాక్ : “ఉస్తాద్ భగత్ సింగ్” కి బ్లాస్టింగ్ రిపోర్ట్స్.?

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”. దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న ఈ మాసివ్ ఏక్షన్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా ఆల్రెడీ ఓ రీమేక్ అని తెలిసి ఇంకొందరు డీలా పడ్డారు.

అయితే ఏదొకలా మంచి హైప్ తీసుకొని రావడానికి మాత్రం మేకర్స్ బాగా ప్లాన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కెరీర్ లో భారీ హిట్ మరియు సాలిడ్ కం బ్యాక్ అయినటువంటి గబ్బర్ సింగ్ వైబ్స్ ని తీసుకురావాలని శతవిధాలాట్రై చేస్తున్నారు.

కాగా ఈ చిత్రం నుంచి అయితే ఈ మే 11 న గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి 11 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఓ అదిరే గ్లింప్స్ ని వదులుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. కాగా ఈ గ్లింప్స్ పై అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి సాలిడ్ రిపోర్ట్స్ ఇపుడు వినిపిస్తున్నాయి. మరోసారి ఫ్యాన్స్ కి మాస్ స్టఫ్ ఇస్తూ హరీష్ శంకర్ వస్తున్నాడని టీజర్ అదిరిపోయింది అంటూ ఇన్సైడ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి.

ఖచ్చితంగా పవన్ ఫ్యాన్స్ ని మెప్పించే కట్స్ తో అయితే ఫుల్ మాస్ మీల్స్ తో ఈ గ్లింప్స్ లోడ్ చేసినట్టుగా సమాచారం. మరి ఈ టీజర్ అయితే ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ 11 వరకు ఆగాల్సిందే. ఇక ఈ మాస్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ అంటూ టాక్ ఇప్పుడు నడుస్తుంది.