ఇన్సైడ్ టాక్ : కీలక నిర్ణయం తీసుకోబోతున్న సమంత.?

సౌత్ ఇండియా సినిమా దగ్గర భారీ స్టార్డం ఉన్న టాలెంటెడ్ స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు. మరి సామ్ అయితే పర్సనల్ లైఫ్ పరంగా ఇప్పుడు పెద్ద పోరాటమే చేస్తూ మరో పక్క తన ప్రోఫిషినల్ లైఫ్ ని అయితే లీడ్ చేస్తుంది. ఇక ఈ ఏడాదిలోనే ఆమె నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “యశోద” భారీ హిట్ కాగా..

ఈ చిత్రం 33 కోట్లకి పైగా వసూళ్లు అందుకొని ఆమె కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా చేస్తున్న సమయంలోనే సమంత తాను అనారోగ్యంగా ఉన్నానని కండరాల సంబంధిత వ్యాధి మాయోసైటిస్ తో తాను పోరాడుతున్నట్టుగా తెలిపింది.

దీనితో అక్కడ నుంచి ఆమె చికిత్స తీసుకుంటూనే మరోపక్క సినిమా కోసం కష్టపడుతుంది. ఇక ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో “ఖుషి” అనే సినిమా ఆమె చేస్తుండగా ఈ సినిమా షూటింగ్ అయితే ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. ఆమె కూడా ఈ సినిమా షూట్ పాల్గొంటుంది కానీ ఈ సినిమా షూటింగ్ అయితే వీలైనంత త్వరగా ఫినిష్ చేసి కీలక నిర్ణయం తీసుకోనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది.

మరి ఈ లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే సమంత పెద్ద బ్రేక్ నే తీసుకోవాలి అనుకుంటుందట. ఆమె సౌత్ కొరియా కి వెళ్లి తన వ్యాధికి సంబంధించి చికిత్స అక్కడ తీసుకోడానికి గాను పెద్ద బ్రేక్ ని తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది. అందుకే కొన్నాళ్ల పాటు సమంత సినిమాలు చేయదట. మరి ఇవన్నీ ఎప్పటికి కంప్లీట్ అవుతాయో చూడాలి.