ఇన్సైడ్ టాక్ : సమంత ట్రీట్మెంట్ కోసం ఆ దేశం వెళ్లబోతుందా.?

ఇండియన్ సినిమా దగ్గర భారీ స్టార్డం సొంతం చేసుకున్నటువంటి హీరోయిన్ లలో సమంత కూడా ఒకామె.. మరి సమంత అయితే హీరోయిన్ గా కన్నా ఎక్కువ ఇప్పుడు పలు చిత్రాలు లేడీ ఓరియెంటెడ్ ఎక్కువగా చేస్తుంది. వాటిలో ఒకటి “యశోద” సూపర్ హిట్ అయ్యి 30 కోట్లకి పైగా వసూళ్లు అందుకొని ఆమె కెరీర్ లో సూపర్ హిట్ అయ్యింది.

అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలోనే సమంత తనకి మాయోసైటిస్ అనే వ్యాధి వాచినట్టు తెలిపి అందరికీ షాకిచ్చింది. దీనితో ఆమె హెల్త్ కి సంబంధించి తర్వాత పర్వాలేదు అనిపించినా ఇప్పుడు లేటెస్ట్ గా కొన్ని ఇన్సైడ్ రిపోర్ట్స్ ఆమె చికిత్సకి సంబంధించి వినిపిస్తున్నాయి.

సమంత అయితే ఈ ట్రీట్మెంట్ కోసం ఏకంగా సౌత్ కొరియా దేశానికి ఇప్పుడు వెళ్ళడానికి సిద్ధం అయ్యినట్టుగా తెలుస్తుంది. అయితే ఇవి ప్రస్తుతానికి రూమర్స్ లానే వినిపిస్తుండగా దీనిపై అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది.

అలాగే పలు నేషనల్ మీడియా వారు కూడా సమంత సౌత్ కొరియా కి వెళ్లనున్నట్టుగానే అంటున్నారు. మరి దీనిపై మరింత క్లారిటీ కోసం వేచి చూడాలి. ఇక నెక్స్ట్ అయితే సమంత నటిస్తున్న మరో చిత్రం “శాకుంతలం” రిలీజ్ కానుంది.