“బ్రో” ట్రైలర్ పై ఇన్సైడ్ టాక్.!

ప్రెజెంట్ మన టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న లేటెస్ట్ రిలీజ్ లలో అయితే గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లు నటిస్తున్న చిత్రం “బ్రో ది అవతార్” ఫస్ట్ ఉంది అని చెప్పాలి. చాలా కాలం తర్వాత సరైన పెద్ద సినిమా కోసం అంతా ఎదురు చూస్తుండగా.

ఈ సినిమా ఆ లోటుని తీర్చే దానిలా వస్తుంది. అయితే ఈ సినిమా నుంచి కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ట్రైలర్ రిలీజ్ పై మేకర్స్ కన్ఫర్మ్ చేస్తూ ఈరోజు సాయంత్రం ఆ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇక ఈ ట్రైలర్ పై మంచి అంచనాలు ఉండగా మొదట ఈ ట్రైలర్ థియేటర్స్ లో తర్వాత సోషల్ మీడియాలో రిలీజ్ కానుంది.

అయితే ఈ ట్రైలర్ పై అయితే సినీ వర్గాలు నుంచి ఇంట్రెస్టింగ్ సమాచారం వినిపిస్తుంది. ఈ ట్రైలర్ అయితే ఫ్యాన్స్ కి నెక్స్ట్ లెవెల్ ట్రీట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. మరి పవన్ స్వాగ్ అండ్ తన స్టైలింగ్ అదిరిపోతాయట. అలాగే ట్రైలర్ బ్రహ్మి మార్క్ డైలాగ్ కూడా ఏదో ఒకటి ఉందని టాక్.

ఇక వీటితో పాటుగా పవన్ తనని తానే ఇమిటేట్ చేసే విధంగా ఈ ట్రైలర్ ఉంటుందని అంటున్నారు. వీటితో పాటుగా పవన్ కానీ సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ కానీ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా సరే వాటిని రీచ్ అయ్యేలా ఈ ట్రైలర్ కట్ ఉంది అని సమాచారం. మరి ఇది ఆ లెవెల్లో ఉందో లేదో చూడాలి. కాగా ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు హీరోయిన్స్ గా నటించగా త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే సహకారం అందించారు. అలాగే థమన్ సంగీతం అందించాడు.