ఇన్సైడ్ టాక్ : “బిగ్ బాస్ 7” కి నాగ్ పై వేటు.?

టాలీవుడ్ అగ్ర తారల్లో ఒకరైనటువంటి హీరో అక్కినేని నాగార్జున హీరోగా మాత్రమే కాకుండా టీవీ లో సహా ఓటిటి లో ప్రసారం అవుతున్న గ్రాండ్ రియాలిటీ షో బిగ్ బాస్ ని కూడా తాను చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే నాగార్జున తెలుగు స్మాల్ స్క్రీన్ పై తనకంటూ ఓ మార్క్ ని సెట్ చేసుకున్నప్పటికీ నాగార్జున అయితే బిగ్ బాస్ హోస్ట్ గా గత నాలుగు సీజన్ల నుంచి కంటిన్యూ అవుతూ వస్తున్నారు.

మరి తాను బాగానే క్లిక్ అయ్యారు కానీ తెలుగు లో ఇప్పుడు షో రేటింగ్ అయితే ఓ మోస్తరు గానే వస్తుందట. దీనితో షో యాజమాన్యం కొత్త హోస్ట్ కోసం చూస్తున్నట్టుగా కొన్ని రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. అలాగే మరోపక్క అయితే నెక్స్ట్ సీజన్లో డెఫినెట్ గా కొత్త హోస్ట్ ని చూసే ఛాన్స్ ఉన్నట్టుగా ఇన్సైడ్ టాక్.

మరి దీనిపై రానున్న రోజుల్లో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు ఉన్న సీజన్ కె వీకెండ్ లో కూడా అనుకున్న దానికన్నా తక్కువే రేటింగ్స్ నమోదు అవుతున్నాయని కొన్ని గాసిప్స్ ఉన్నాయి. దీనితో కొత్త హోస్ట్ గా ఎవరు కనిపించే ఛాన్స్ ఉందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.