తెలుగు సినిమాకి దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాదిలోనే రైజ్ అయ్యి మళ్ళీ డౌన్ అయ్యిన సంగతి తెలిసిందే. దీనితో అందుకే మళ్ళీ మెగా ఫ్యాన్స్ ఓ భారీ కం బ్యాక్ ని అయితే ఆశిస్తున్నారు. దీనితో తన నెక్స్ట్ సినిమా అయ్యిన మెగా స్టార్ 156 పైనే అంతా అసలు పెట్టుకోగా దీనిని దర్శకుడు బింబిసార ఫేమ్ వసిష్ఠ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నాడు.
ఐతే నిన్ననే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం ఓ కీలక సన్నివేశంతో మొదలైనట్టుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ నుంచి కాస్త సున్నితంగా రెగ్యులర్ గా రోల్స్ ఉంటే ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. అందుకే వాల్తేరు వీరయ్య లో ఓ మత్స్యకారునిగా కనిపించిన చిరు తన యాస నడవడికతో అదరగొట్టేసారు.
ఇది అయితే చిరు కి చాలా సినిమాల్లో కామన్ కానీ ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త ప్రాజెక్ట్ లో కూడా సరికొత్తగా చిరు కనిపిస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. చిరు కోసం ఈ యంగ్ దర్శకుడు ఓ సరికొత్త బాడీ లాంగ్వేజ్ ని డిజైన్ చేయడమే కాకుండా తన యాస భాషలతో కూడా మెగాస్టార్ చేస్తాడని అంటున్నారు.
దీనితో మెగా ఫ్యాన్స్ మాత్రం ఏఈ విషయంలో మరింత ఎగ్జైట్ అవుతున్నారని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాపై హైప్ గట్టిగానే ఉంది. ఇక వీటితో ఇది మరింత లెవెల్ కి వెళ్తుంది అని చెప్పాలి. ప్రస్తుతం కొన్ని రోజులు పాటు ఈ షూట్ కంటిన్యూ కానుంది.