ఇన్సైడ్ ఇన్ఫో : “SSMB28” గ్లింప్స్ ఎలా ఉందంటే.!

ఇప్పుడు టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు చార్జ్య్ కాంబినేషన్స్ లో దర్శకుడు త్రివిక్రమ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ కం వారి హ్యాట్రిక్ సినిమా కూడా ఒకటి. కాగా ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా అయితే తెరకెక్కుతుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఈ మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి కానుకగా అయితే ఫ్యాన్స్ కి మాసివ్ ట్రీట్ అందిస్తున్నట్టుగా ఓ గ్లింప్స్ ని అయితే లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ గ్లింప్స్ పై సాలిడ్ ఇన్ఫో ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పటివరకు ఫ్యాన్స్ పెట్టుకున్న అన్ని సందేహాలకు త్రివిక్రమ్ ఈ గ్లింప్స్ తో సమాధానం ఇవ్వనున్నాడట.

ఈ గ్లింప్స్ వీడియో ఊహించని మాస్ లెవెల్లో ఉంటుంది అని దర్శకుడు త్రివిక్రమ్ మాస్ అంటే ఏంటో ఈ వీడియో తో చూపిస్తాడని తెలుస్తుంది. ఇక మహేష్ బాబు ని గాని తనపై డైలాగ్స్ గాని సాలిడ్ హిట్టింగ్ గా అయితే త్రివిక్రమ్ ప్రెజెంట్ చేసారని మహేష్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

దీనితో అయితే ఈ మే 31 న మహేష్ ఫ్యాన్స్ కి భారీ ట్రీట్ కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. కాగా ఈ చిత్రంలో పూజా హెగ్డే మరియు శ్రీ లీల లు హీరోయిన్స్ గా నటిస్తుండగా హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జూన్ 13న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.