ఇండస్ట్రీ టాక్ : “భారతీయుడు 2” ని శంకర్ ముందే పట్టాలెక్కించనున్నారా..?

ఇండియన్ సినిమా దగ్గర తన సినిమాలతో ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ని అందించిన సెన్సేషనల్ దర్శకుడు శంకర్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీ స్థాయిలో విజువల్స్ తో పాటుగా సాలిడ్ సోషల్ మెసేజ్ ని కూడా ఇచ్చి సినిమాని నెక్స్ట్ లెవెల్లో శంకర్ ప్రెజెంట్ చేస్తాడు.

అందుకే తాను కెరీర్ స్టార్ట్ చేసిన మొదటిలోనే ఒక్కో సినిమా ఒక్కో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలా నిలిచింది. మరి భారీ హిట్ చిత్రాల్లో ఉలగనయగన్ కమల్ హాసన్ హీరోగా చేసిన చిత్రం “భారతీయుడు” తమిళ్ సహా తెలుగులో అప్పట్లో భారీ రికార్డులు నెలకొల్పింది.

మరి దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ ని అనౌన్స్ చేసి దానిని పట్టాలెక్కింది దాదాపు 60 సాతంకి పైగానే తెరకెక్కించారు. కానీ అనుకోని రీతిలో ఈ చిత్రం షూటింగ్ నిలిచిపోవడం దర్శకుడు శంకర్ కి నిర్మాతలకి భేదాలు రావడంతో మధ్యలోనే ఈ సినిమా ఆగిపోయింది.

కానీ మొత్తానికి కొన్ని మీటింగులు కేసులు అనంతరం శంకర్ తోనే మళ్ళీ షూటింగ్ కి ఒప్పించి ఫైనల్ చేశారు. అయితే ఇక ఈ వార్తలు వచ్చాక శంకర్ ఈ సినిమా షూట్ లో ఈ ఏడాది చివర డిసెంబర్ లో జాయిన్ అవ్వనున్నారని టాక్ తెలిసింది. కానీ తాజాగా వచ్చిన అప్డేట్ ఏమిటంటే..

హీరో కమల్ హాసన్ ప్రస్తుతం అమెరికా కి భారతీయుడు లుక్ కోసం ప్రిపరేషన్ కి వెళ్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడే ఎందుకు అంటే ఈ సినిమా షూటింగ్ కాస్త ముందే అంటే ఈ సెప్టెంబర్ నెల లోనే స్టార్ట్ అవనున్నట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే ఈ చిత్రం ముందే మొదలు కానుంది అని కన్ఫర్మ్ అయ్యిపోయింది.