ఇండస్ట్రీ టాక్ : “పుష్ప 2”..  ఇంటర్నేషనల్ లెవెల్లో.. 

ప్యాన్ ఇండియా మార్కెట్ లో సొంతంగా క్రేజ్ అండ్ మార్కెట్ ని తెచ్చుకున్న టాలీవుడ్ హీరోస్ లో అల్లు అర్జున్ మొట్ట మొదటిగా ఉంటాడు. కాగా అల్లు అర్జున్ “పుష్ప” చిత్రంతో టోటల్ ఇండియన్ సినిమాని షేక్ చెయ్యగా పుష్ప 2 కోసం ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ చిత్రంని దర్శకుడు సుకుమార్ మరింత పక్కా ప్లానింగ్ ప్రకారం తెరకెక్కిస్తుండగా ఈ సారి సినిమాని మాత్రం మరింత గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం మొదటి భాగం లోనే చైనా, జపాన్ లాంటి దేశాల ప్రస్తావన ఉంది అలాగే పుష్ప క్లైమాక్స్ లో కూడా ఆ దేశానికీ చెందిన వారు పుష్ప పెళ్ళిలో కనిపిస్తారు.

ఇప్పుడు ఇదే కోణంలో పుష్ప 2 ని జపాన్ లో తెరకెక్కించడానికి ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో చేస్తున్న షూటింగ్ కంప్లీట్ అయ్యాక జపాన్ కి చిత్ర యూనిట్ వెళుతున్నారని అక్కడ పలు కీలక సన్నివేశాలు చేయడానికి వెళ్తున్నారని దీనితో పుష్ప 2 అనేది పక్కా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది ఇపుడు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

మరి సుకుమార్ అయితే ఈ భారీ చిత్రాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. ఇంకా ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్నారు అలాగే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.