ఇండస్ట్రీ టాక్ : పవన్ డేట్స్ కోసం ఎదురు చూపులు..!

ప్రెజెంట్ టాలీవుడ్ లో సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా భారీ క్రేజ్ అండ్ డిమాండ్ ఉన్న స్టార్ హీరోస్ లో గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. మరి పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలే చేస్తుండగా ఈ చిత్రాల్లో ఇప్పుడు ఆల్రెడీ సెట్స్ మీద ఉస్తాద్ భగత్ సింగ్ మరియు ఓజి చిత్రాలు ఉన్నాయి.

ఇక వీటితో పాటుగా హరిహర వీరమల్లు అనే భారీ చిత్రం కూడా ఉంది కానీ అదైతే ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా అర్ధం కాని పరిస్థితి. మరి ఈ మూడ్ చిత్రాలు పవన్ మధ్యలోనే ఆపి ఉంచారు. ఎప్పుడు దేనికి డేట్స్ ఇస్తున్నారో కూడా అర్ధం కాని పరిస్థితి. కాగా ఈ చిత్రాల్లో అయితే ఓజి మేకర్స్ పవన్ డేట్స్ కోసం ఇప్పుడు గట్టిగా ట్రై చేస్తున్నారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

పవన్ మరొక్క 30 రోజులు అలా కాల్షీట్స్ కానీ అలా సినిమా సినిమా మొత్తం కంప్లీట్ చేసేస్తామని చెప్తున్నారట. దీనితో పవన్ డేట్స్ విషయంలో ఒక్క గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే బాకీ ఉందని తెలుస్తుంది. మరి పవన్ ఎప్పుడు ఓకే చెప్తారో చూడాలి.

ఇక ఈ భారీ ప్రాజెక్ట్ ని యంగ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తుండగా యంగ్ నటి ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి తదితరులు నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలానే ఆర్ ఆర్ ఆర్ నిర్మాణ సంస్థ డీవీవీ వారు నిర్మాణం వహిస్తున్నారు.