ఇండస్ట్రీ టాక్ : పవన్ కళ్యాణ్ కి చిన్నపాటి అస్వస్థత…!

టాలీవుడ్ ప్రముఖ హీరో అలాగే ఏపీ రాజకీయాల్లో ఓ రాజకీయ పార్టీ అధినేత అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంత కాలం వరకు సినిమాలు అలాగే తన రాజీకీయాలు బ్యాలన్సుడ్ గా నడిపిన పవన్ ఇప్పుడు ఎక్కువ రాజకీయాల్లోనే బిజీగా ఉండడంతో సినిమాలు పక్కకి పెట్టేసారు.

అంతే కాకుండా అవి ఎప్పుడు మొదలవుతాయి అనేది కూడా అర్ధం కాని పరిస్థితిలా మారింది. ఇక ఇటీవల పవన్ తన రైతు భరోసా యాత్ర అలాగే జన వాణి అంటూ పలు కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉండగా ఈ మీటింగ్స్ లో వర్షాలు పవన్ అభిమానుల అత్యుత్సాహంతో కొన్ని గాయాల పాలయ్యాడు..

దీనితో ఇదే ఇప్పుడు తన ఆరోగ్యానికి దెబ్బ తీసింది. మళ్ళీ పవన్ ఆగకుండా తర్వాత రోజు కూడా మరో కార్యక్రమంలో పాల్గొనే సరికి ఇప్పుడు పవన్ స్వల్ప అస్వస్థతకి లోనయ్యాడని అయితే ఇప్పుడు కంగారు పడాల్సిన పని లేదని పవన్ కి చిన్న జ్వరంగా ఉండగా ఇప్పుడు రెస్ట్ లో ఉన్నారని సినీ వర్గాల నుంచి సమాచారం.

అయితే కంప్లీట్ గా సేట్ఠస్ ఏంటి అనేది ఎవరికీ ఇంకా తెలియరాలేదు. మరి కొంతకాలం పవన్ ఇవన్నీ పక్కన పెడతారా లేదా మళ్ళీ సినిమాలు చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.