ఇండస్ట్రీ టాక్ : మరోసారి బాలయ్య, మహేష్ కానీ మరో స్పెషల్ గెస్ట్ కూడా 

టాలీవుడ్ సినిమా మాస్ గాడ్ నందమూరి నటసింహ నందమూరి బాలయ్య సినీ కెరీర్ చూస్తే తన సెకండాఫ్ లో మాత్రం తనకి ఇప్పుడు బెస్ట్ దశలో తానూ ఉన్నారని చెప్పాలి. కాగా దీనితో పాటుగా తాను చేస్తున్న టాక్ షో అన్ స్టాప్పబుల్ కోసం కూడా అందరికీ తెలిసిందే. మరి ఈ షో లో అయితే ఇది వరకే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరైన సంగతి తెలిసిందే.

మొదటి సీజన్ ఎండింగ్ ఎపిసోడ్ గా అయితే దీనిని ప్లాన్ చేయగా దీనితో అప్పుడు రికార్డులు బద్దలయ్యాయ్. కాగా ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తున్న మరో క్రేజీ టాక్ ప్రకారం మళ్ళీ బాలయ్య మహేష్ బాబు అలాగే ఇంకో స్పెషల్ గెస్ట్ లు కలిసి తన షో స్టేజి పంచుకోనున్నారని ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఆ స్పెషల్ గెస్ట్ మరెవరో కూడా కాదట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని తెలుస్తుంది. కాగా మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేసిన తాజా చిత్రం “గుంటూరు కారం” ప్రమోషన్స్ లో భాగంగా అయితే తాము ఈ షోలో కనిపించనున్నారని తెలుస్తుంది.

మరి ఇదే కానీ నిజం ఐతే ఈ షో హిస్టరీ లోనే ఒక బెస్ట్ ఎపిసోడ్స్ లో ఒకటిగా నిలుస్తుంది అని చెప్పవచ్చు. కాగా దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. మరో పక్క బాలయ్య యంగ్ దర్శకుడు కొల్లి బాబీ తో తన కెరీర్ 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అన్ స్టాపబుల్ సీజన్ ని లిమిటెడ్ వెర్షన్ గా మాత్రమే ప్లాన్ చేశారు.