ఇండస్ట్రీ టాక్ : “పుష్ప 2” నుంచి అప్పటివరకు నో అప్డేట్ అట.!

సొంతంగా పాన్ ఇండియా లెవెల్లో స్టార్డం తెచ్చుకున్న ఏకైక టాలీవుడ్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ముమ్మాటికీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పాలి. తన పుష్ప తో ఒక్కసారిగా నార్త్ లో తన ప్రభావాన్ని అల్లు అర్జున్ చూపించాడు. అక్కడ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన తాను నెక్స్ట్ పుష్ప 2 పై మాత్రం నెక్స్ట్ లెవెల్ హైప్ ని సెట్ చేసుకున్నాడు.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా పై అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఓ సమాచారం ఇప్పుడు తెలుస్తుంది. బన్నీ అభిమానులు ఆశించదగ్గ అప్డేట్ అయితే ఈ మధ్య కాలంలో రాదట.

దాదాపు ఏప్రిల్ నెల వరకు అందుకోసం ఆగాల్సి ఉంటుంది అని రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ నెలలో అల్లు అర్జున్ బర్త్ డే ఉంది కావున అప్పుడు ఏదైనా అప్పుడే ఉండొచ్చని అంటున్నారు. మరి ఇందులో ఇంకా ఎంతమేర నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా లాస్ట్ సినిమా ఐటెం సాంగ్ లో కనిపించిన స్టార్ హీరోయిన్ సమంత కూడా ఉండొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. అలాగే అదనంగా అనేకమంది బిగ్ స్టార్స్ ఈ సినిమాలో నటించనుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు అలాగే మైత్రి మేకర్స్ తో సుకుమార్ కూడా ప్రొడ్యూసర్ గా చేస్తున్నాడు.