ఇండస్ట్రీ టాక్ : పవన్ “ఓజి” రిలీజ్ టైం ఫిక్స్.?

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం ఒకో సినిమాని వరుసగా గ్యాప్ లేకుండా చేసేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ లిస్ట్ లో అయితే పవన్ రీసెంట్ గానే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి క్రేజీ షెడ్యూల్ కంప్లీట్ చేసి యంగ్ దర్శకుడు సుజీత్ తో ప్లాన్ చేసిన మస్సివ్ యాక్షన్ డ్రామా “ఓజి” సెట్స్ లో జాయిన్ అయ్యారు.

మరి పవన్ అయితే ఈ సినిమా షూట్ కోసం చాలా కాలం తర్వాత హైదరాబాద్ వదిలి వెళ్లగా ముంబై లో ఈ సినిమా షూటింగ్ ఇపుడు ఫుల్ స్వింగ్ లో అయితే జరుగుతుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం పవన్ కేటాయించింది డేట్స్ తక్కువే అయినప్పటికీ రిలీజ్ పై అయితే ఇపుడు క్రేజీ టాక్ ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తుంది.

కాగా ఈ సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని అయితే ఈ వచ్చే ఏడాది కాకుండా ఆ వచ్చే ఏడాది 2025 కి అయితే రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే ఈ అవైటెడ్ సినిమా కోసం ఇంకో ఏడాది ఆగి తీరాల్సిందే అని చెప్పాలి.

కాగా ఈ సినిమా లో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా ఫిక్స్ కాగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఆర్ ఆర్ ఆర్ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో పవన్ కెరీర్ లోనే ఓ మాసివ్ ఏక్షన్ ఎంటర్టైనర్ లా అయితే ప్లాన్ చేస్తున్నారు.