ఇండస్ట్రీ టాక్ : శంకర్ – రామ్ చరణ్ సినిమాపై లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటంటే.!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా చిత్రాలలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే దర్శకుడు శంకర్ ల కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ మాస్ మరియు సోషల్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. అయితే ఇప్పుడు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాపై పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి.

మొదటగా ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లోనే భారీ సెట్స్ లో జరుగుతుండగా ఈ షెడ్యూల్ లో శంకర్ ఒక అదిరిపోయే యాక్షన్ సీన్ ని తాను తెరకెక్కిస్తున్నారట. మరి ఇది అయితే ఆడియెన్స్ ని ఆశ్చర్యపరుస్తుందట.

ఆ లెవెల్లో ఒక సరికొత్త ఏక్షన్ సీన్ ని అయితే శంకర్ మళ్ళీ ఇండియన్ సినిమా దగ్గర తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటంటే ఈ చిత్రంలో సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన సాంగ్స్ లో ఆల్రెడీ మూడు సెన్సేషనల్ ట్రాక్స్ అందించాడట.

ఇవి డెఫినెట్ గా మ్యూజిక్ ప్రపంచాన్ని రూల్ చేస్తాయని ఈ సినిమాకి దగ్గర వర్గాలు నుంచి వస్తున్న సమాచారం. మొత్తానికి అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్స్ గా ఇవి తెలుస్తున్నాయి. ఇంకా ఈ సినిమాలో కియారా నటిస్తుండగా దిల్ రాజు అయితే వచ్చే ఏడాది ఉగాది రేస్ లో నిలబెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.