ఇండస్ట్రీ టాక్ : మొదటిగా “దేవర” ప్రపంచాన్ని పరిచయం చేస్తారా??

గత ఏడాది ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన ఎన్నో చిత్రాల్లో మన తెలుగు సినిమా నుంచి వచ్చిన చిత్రాల్లో గ్లోబల్ ఫినామినా సినిమా “ఆర్ ఆర్ ఆర్” సినిమా కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాలో నటించిన ఇద్దరు టాలీవుడ్ బిగ్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు ఇద్దరు కూడా భారీ ఫేమ్ ని తెచ్చుకున్నారు.

అయితే వారిలో ఎన్టీఆర్ చేస్తున్న మాసివ్ చిత్రమే “దేవర”. దీనికి ముందు ఘోరమైన ప్లాప్ ఉన్నప్పటికీ దర్శకుడు కొరటాల శివతో ఈ సినిమా చేస్తున్నప్పటికీ దీనిపై ఇప్పుడు అంచనాలు మాములుగా లేవు. కాగా వీటిని మించిన షాక్ అయితే దర్శకుడు కొరటాల శివ ఇస్తాడు అని సినీ వర్గాలు చెప్తున్నాయి.

మరి లేటెస్ట్ ఇండస్ర్టీ వర్గాల టాక్ ప్రకారం ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ నుంచి మొట్ట మొదటిగా దర్శకుడు కొరటాల శివ అసలు దేవర ప్రపంచం ఏంటి? ఎలా ఉండబోతుంది అనేది భారీ విజువల్స్ తో చూపించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇది మొదటగా ఒక గ్లింప్స్ గా ఈ జనవరి 1 కొత్త సంవత్సరం కానుకగా రావచ్చని అంటున్నారు.

దీనితో ఈ క్రేజీ థాట్ ఇపుడు ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతూ వెళ్తుంది. మరి ఈ భారీ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా ఈ సినిమాతో ఆమె తెలుగు సినిమాకి పరిచయం అవుతుంది. అలాగే సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.