ఇండస్ట్రీ టాక్ : ప్రయోగాత్మక యువ దర్శకునికి బాలయ్య ఛాన్స్.?

మళ్ళీ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అంతా ఒక్కసారిగా కం బ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ అయ్యింది. అలా బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ ఇచ్చిన మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ ముందు కూడా మరిన్ని సినిమాలు తాను ఓకే చేస్తున్నారు.

అలాగే ఇప్పుడు తన కెరీర్ 108వ సినిమాని తాను దర్శకుడు అనీల్ రావిపూడి తో చేస్తుండగా ఇక ఈ తర్వాత బాలయ్య అఖండ 2 ని స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఈ అన్ని సినిమాలు ఒకెత్తు ఐతే ఓ యంగ్ దర్శకుడికి బాలయ్య ఛాన్స్ ఇచ్చినట్టుగా ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

మరి ఆ దర్శకుడు ఇంకెవరో కాదు తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ లో తన క్రియేటివిటీ తో తీసుకెళ్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ తో అట. ఇప్పుడు తాను బాలయ్య తో ఆహా లో అన్ స్టాప్పబుల్ చేస్తున్నాడు అలాగే ఈ దర్శకుడు చేసిన లేటెస్ట్ వర్క్ “హనుమాన్” కోసం అయితే ఇండియా అంతా మాట్లాడుకుంటుంది.

ఇక ఇలాంటి దర్శకునితో సినిమా అంటే ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఆల్రెడీ ప్రశాంత్ జాంబీ రెడ్డి, అనే సినిమా చేసి మరో పక్క సూపర్ హీరో సినిమా కూడా ఒకటి చేస్తున్నాడు. ఇలా తన విజన్ తో ఓ రేంజ్ సినిమాలు ప్రయోగాత్మకంగా తాను చేస్తున్నాడు. మరి ఇలాంటి దర్శకునితో అంటే మళ్ళీ బాలయ్య నుంచి చాలా కాలం తర్వాత ఓ సరికొత్త ప్రయోగమే ఉంటుంది అని చెప్పాలి.