ఇండస్ట్రీ టాక్ : కెరీర్ లోనే బెస్ట్ సినిమా లాక్ చేసుకున్న బాలయ్య?

టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి నటసింహ బాలకృష్ణ సినిమాలు అంటే ఒకప్పుడు ఓ రేంజ్ అనే టైం నుంచి తర్వాత ట్రోల్స్ అండ్ కామెడీ పీస్ లుగా మిగిలే వాటిలా మారిపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం బాలయ్య ఉన్న పీక్ రేంజ్ లో సీనియర్స్ స్టార్ హీరోస్ లో ఎవరూ లేరని చెప్పాలి.

మంచో చెడో స్ట్రైట్ సినిమాలే చేస్తున్న బాలయ్య ఇప్పుడు ఓ భారీ హిట్ ని భగవంత్ కేసరి తో అయితే స్కోర్ చేశారు. ఇక ఈ చిత్రం కాకుండా అయితే నెక్స్ట్ దర్శకుడు బాబీ తో ఓ మాసివ్ ప్రాజెక్ట్ ని లాక్ చేయగా అసలు ఈ చిత్రం అనౌన్స్ చేయడంతో అంచనాలు ఓ రేంజ్ కి వెళ్లాయి.

కాగా ఈ చిత్రం తన కెరీర్ లో 109వ సినిమా అయితే 110 వ సినిమా మాత్రం బాలయ్య కెరీర్ లోనే ది బెస్ట్ వన్ అని చెప్తున్నారు ఇండస్ట్రీ విశ్లేషకులు. ఎందుకంటే బాలయ్య 110 వ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ 3 దర్శకుల్లో ఒకరైన దర్శకుడు సుకుమార్ తెరకెక్కించనున్నారని గట్టి టాక్ సినీ వర్గాల్లో అయితే మొదలైంది.

బాలయ్య కి సంబంధించి కొన్ని ట్రస్టడ్ సోర్సెస్ నుంచి కూడా ఈ కాంబినేషన్ ఉందనే అంటున్నారు. దీనితో మాత్రం ఇది సాధ్యం అయితే బాలయ్య ఇంకో మెట్టు ఎక్కేసినట్టే అని చెప్పొచ్చు. కాగా ఇప్పుడు ఆల్రెడీ దర్శకుడు సుకుమార్ రంగస్థలం, పుష్ప, పుష్ప 2 అని మాస్ పీక్ లో ఉన్నాడు మరి ఇలాంటి దర్శకునితో బాలయ్య లాంటి హీరో అంటే ఆ మాస్ ఇంకో లెవెల్ లో ఉంటుంది.