ఇండస్ట్రీ టాక్ : తమిళ్ మాస్ డైరెక్టర్ తో అల్లు అర్జున్?

ఇప్పుడు సౌత్ సహా బాలీవుడ్ మార్కెట్ లో కూడా అనేక మంది స్టార్స్ ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకో ఇండస్ట్రీకి కలిసి వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా చేస్తున్న ఆల్ మోస్ట్ అన్ని కాంబినేషన్ లు కూడ భారీ హిట్ అయ్యాయి. మరి అలా సౌత్ నుంచి హిందీ హీరోస్ తో చేసిన రీసెంట్ సినిమాలు అందుకు నిదర్శనం.

కాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో చేసిన “ఆనిమల్” సెన్సేషనల్ హిట్ అయింది. ఇక ఈ చిత్రం కన్నా ముందు తమిళ దర్శకుడు యంగ్ అండ్ టాలెంటెడ్ అట్లీ తెరకెక్కించిన “జవాన్” కూడా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు దర్శకుడు అట్లీ తో అల్లు అర్జున్ కాంబినేషన్ పై మరోసారి బిగ్ రూమర్ వినిపిస్తుంది.

ఈ క్రేజీ కాంబినేషన్ పై ఎప్పుడు నుంచో బజ్ ఉంది కానీ అది జవాన్ తోనే కంప్లీట్ కావాల్సింది. కానీ అది పూర్తి కాలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఈ క్రేజీ కాంబినేషన్ లో ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా ఫిక్స్ అయ్యినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. అట్లీ ఎప్పుడు నుంచో అల్లు అర్జున్ తో వర్క్ చేయాలనీ ఎదురు చూస్తున్నాడు.

అలాగే ఫ్యాన్స్ కూడా ఈ మాస్ అండ్ స్టైలిష్ కాంబినేషన్ కోసం కూడా చూస్తుండగా ఇప్పుడు తమిళ సినీ వర్గాల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో క్లారిటీ మరికొన్నాళ్లలో అయితే కన్ఫర్మ్ అవుతుంది. కాగా ఈ సినిమా ఇపుడు అల్లు అర్జున్ చేస్తున్న మాస్ సీక్వెల్ పుష్ప 2 తర్వాతే ఉండొచ్చని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ కాంబినేషన్ ఎలా మెటీరిలైజ్ అవుతుందో.