Gallery

Home News లైగర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్‌లో ఉందట ..?

లైగర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్‌లో ఉందట ..?

లైగర్ .. విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతోంది. ధర్మ ప్రొడక్షన్స్ – పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి నిర్మిస్తుండగా బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ సమర్పిస్తున్నాడు. అయితే లైగర్ లాక్ డౌన్ కి ముందే ముంబై ధారావి లో 40 శాతం షూటింగ్ జరుపుకుంది. ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. లాక్ డౌన్ తర్వాత అన్ని సినిమాల షూటింగ్ మొదలైనప్పటికి పూరి జగనాధ్ – విజయ్ దేవరకొండ ల లైగర్ మాత్రం సెట్స్ మీదకి రాలేదు. అందుకు కారణం ఈ సినిమాకి స్టంట్ కొరియో గ్రాఫర్స్ విదేశీ వారు కావడమే అని అంటున్నారు.

Vijay Devarakonda Fighter Movie Opening 5 | Telugu Rajyam

కాగా త్వరలో మళ్ళీ లైగర్ సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు పూరి జగన్నాధ్ సన్నాహాలు చేస్తున్నాడు. ముందుగా భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించేందుకు పూరి ప్లాన్ చేసుకుంటున్నట్టు తాజా సమాచారం. కాగా రీసెంట్ గా పూరి టీం ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ముందు నుంచి ఈ సినిమాకి ఫైటర్ అన్న టైటిల్ ప్రచారంలో ఉండగా పూరి జగన్నాధ్ లైగర్ అన్న టైటిల్ ని అనౌన్స్ చేసి భారీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. సినిమాకి టైటిల్ పెట్టడంలో పూరి తో మరే డైరెక్టర్ పోటీకీ రాలేడని మరోసారి ప్రూవ్ చేశాడు. ఇక ఈ టైటిల్ కి ఇచ్చిన సాలా క్రాస్‌బ్రీడ్ అన్న ట్యాగ్ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అర్థమవుతోంది.

Liger 2 | Telugu Rajyam

ఇక ఈ సినిమా దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో రూపొందనుండగా తెలుగు తో పాటు హిందీ.. తమిళం.. కన్నడ భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. అయితే పూరి జగన్నాధ్ సినిమా ఎప్పుడు మొదలు పెట్టాడు.. అప్పుడే రిలీజ్ అంటున్నాడన్న మాట ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటారు. కాని ఫస్ట్ టైం కరోనా వల్ల పూరి జగన్నాధ్ నుంచి రావాల్సిన విజయ్ దేవరకొండ లైగర్ చాలా లేటయింది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ఒక క్లారిటీ వచ్చిందని సమాచారం. పూరి జగన్నాధ్ లైగర్ సినిమాని జూలై లో రిలీజ్ చేయాలని డిసైడయినట్టు లేటెస్ట్ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలో మేకర్స్ నుంచి అఫీషియల్ అప్‌డేట్ రానుందట. అయితే ఆ సమయంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కదా పూరి లైగర్ ని ఎలా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడని షాకవుతున్నారట.

- Advertisement -

Related Posts

కరోనా ఎఫెక్ట్: ఈ ఏడాదైనా ఎన్టీవీ ‘కోటి దీపోత్సవం’ జరిగేనా..?

ప్రముఖ వార్తా చానెల్ ఎన్టీవీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యక్షంగా వేలమంది భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని సంస్థకే చెందిన భక్తి చానెల్...

ఐటీ పాలసీ, EMC, డిజిటల్ లైబ్రెరీలపై సీఎం జగన్ సమీక్ష…పలు కీలక నిర్ణయాలు !

తాడేపల్లి: ఎపీ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్స్(EMC) ,గ్రామాల్లో డిజిటల్ లైబ్రెరీల ఏర్పాటుపైన అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఈ...

ఇప్పటిదాకా ఆసుపత్రుల దోపిడీ, ఇకపై విద్యా సంస్థల దోపిడీ.

కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా దోచేశాయ్. ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల వంతు వచ్చినట్టుంది. దోపిడీ షురూ అయ్యింది. వేలల్లో లక్షల్లో ఫీజుల్ని గుంజేస్తున్నాయి ప్రైవేటు విద్యా సంస్థలు....

Latest News