ఇండస్ట్రీ బజ్ : “ఓజి” కి అసలు టైటిల్ ఇదే..అనౌన్సమెంట్ కూడా??

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు చిత్రాల్లో యంగ్ దర్శకుడు సుజీత్ తో చేస్తున్న భారీ పాన్ ఇండియా ఏక్షన్ డ్రామా “ఓజి” కూడా ఒకటి. కాగా ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ గా ఓజి తో పిలవబడుతున్న ఈ చిత్రం విషయంలో పవన్ ఫ్యాన్స్ మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారు.

కాగా ఈ చిత్రం అయితే ఇప్పుడు షూటింగ్ ని పవన్ లేని సన్నివేశాలు తెరకెక్కించుకుంటుంది. అయితే ఈ సినిమాకి టైటిల్ ఏంటి అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సినిమాకి మేకర్స్ “దే కాల్ హిం ఓజి” అనే టైటిల్ ని ఖరారు చేసినట్టుగా రూమర్స్ బయటకి వచ్చాయి.

కాగా ఇది వరకే ఓజి టైటిల్ ని అనౌన్స్ చేయొచ్చు కానీ అది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ని కాకుండా పవన్ కి వేరే పేరు ఉంటుంది అని బజ్ వచ్చింది. కాగా ఇప్పుడు అయితే అసలు టైటిల్ ఇదే అంటూ ఈ కొత్త టైటిల్ వైరల్ గా మారింది. ఇక ఈ టైటిల్ ని అయితే అధికారికంగా అనౌన్స్ కూడా చేసేస్తారు అని ఇపుడు రూమర్స్ మొదలయ్యాయి.

కాగా వచ్చే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ ఉండగా ఆరోజున అయితే టైటిల్ ని రివీల్ చేస్తారు అని సమాచారం. మరి ఇదే టైటిల్ వస్తుందా లేక కొత్త టైటిల్ ఏమన్నా వస్తుందా అనేది వేచి చూడాలి. ఇంకా ఈ చిత్రంలో కోలీవుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయ రెడ్డి లాంటి భారీ క్యాస్టింగ్ ఈ చిత్రంలో కనిపిస్తుంది.