ఇండస్ట్రీ బజ్ : పవన్ మాసివ్ ప్రాజెక్ట్ కి ముహూర్తం ఖరారు.?

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత కొన్ని రీమేక్ లు కూడా పవన్ లైన్ లో ఉన్నాయి. అయితే వీటితో పాటుగా ఓ సూపర్ స్ట్రైట్ చిత్రం పవన్ అభిమానులు బాగా ఎగ్జైట్ అవుతున్న చిత్రం కూడా ఉంది.

ఆ సినిమానే “ఒరిజినల్ గ్యాంగ్ స్టర్”. ప్రస్తుతానికి ఓజి అని పిలవబడుతున్న ఈ మాసివ్ ప్రాజెక్ట్ ని యంగ్ దర్శకుడు సుజీత్ ప్లాన్ చేసాడు. కాగా ఈ చిత్రంని మార్షల్ ఆర్ట్స్ సహా మాఫియా నేపథ్యంలో తెరకెక్కించనుండగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ కావడం తోనే ఓ రేంజ్ లో హైప్ తెచ్చేసుకుంది.

మరి ఈ చిత్రం అయితే అప్పుడు మళ్ళీ ఎలాంటి ఊసు లేదు. అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో ఈ క్రేజీ సినిమాపై లేటెస్ట్ బజ్ ఒకటి బయటకి వచ్చింది. దీనితో అయితే ఈ నెలాఖరు లోనే సినిమాకి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారట. అంటే ఈ జనవరి 30 నే ఈ చిత్రం పూజా కార్యక్రమం తో షురూ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మాసివ్ ప్రాజెక్ట్ ఓ కొలిక్కి వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అలాగే టాలీవుడ్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ట్రిపుల్ ఆర్(RRR) ని తెరకెక్కించిన నిర్మాణం సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నారు.