Manchu Lakshmi: ఈ లోకంలో ఏది నీది కాదు.. సంచలనంగా మారిడా మంచు లక్ష్మి పోస్ట్!

Manchu Lakshmi: గత నాలుగు రోజులుగా మంచు కుటుంబంలో వరుసగా వివాదాలు చోటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే అయితే ఆస్తి కోసమే ఈ గొడవలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంపై క్లారిటీ లేదు కానీ గత మూడు రోజులుగా సోషల్ మీడియాలోనూ మీడియా వార్తలలోనూ అలాగే సినీ ఇండస్ట్రీలో కూడా మంచు కుటుంబంలో జరిగే గొడవల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఈ గొడవలలో భాగంగా మంచు విష్ణు మోహన్ బాబు మనోజ్ పై దాడి చేయించడం మోహన్ బాబు హాస్పిటల్ పాలు కావడం మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడం వంటి అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక మంచు మనోజ్ సైతం ఎంతో ఎమోషనల్ అవుతూ మీడియా సమావేశాల్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇంత జరుగుతున్నా కూడా మంచు లక్ష్మి మాత్రం ఈ వివాదంపై ఎక్కడ స్పందించలేదు.

ఇక ఈమె ఇటీవల తన కూతురితో ఒక రీల్ వీడియోను చేసి ఆ వీడియో షేర్ చేస్తూ పీస్ అంటూ పోస్ట్ చేశారు. ఇలా కుటుంబంలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న మంచు లక్ష్మికి ఆ గొడవలు గురించి ఏమాత్రం పట్టలేదా ఇలా ప్రశాంతంగా ఉన్నారే అంటూ కొందరు కామెంట్లు చేశారా అయితే తాజాగా ఈమె మరొక సంచలనమైన పోస్ట్ చేశారు.

ఈ లోకంలో ఏది నీది కానప్పుడు ఏదో కోల్పోతున్నామనే భయం నీకెందుకు అంటూ ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే మంచు లక్ష్మి ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారు అనే దాని పట్ల చర్చలు జరుగుతున్నాయి. ఈమె మంచు విష్ణును ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారా లేకపోతే మనోజ్ కు మద్దతుగా నిలిచి ఇలాంటి పోస్ట్ చేశారా అన్నది తెలియదు కానీ ఈ పోస్ట్ మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతుంది.