రాఘవ లారెన్స్ 2007లో దర్శకత్వం వహించి, నటించిన చిత్రం ముని. ఈ సినిమా విడుదలైన తర్వాత ఒక మోస్తరు విజయాన్ని అందుకుంది. దానికి కొనసాగింపుగా2011లో కాంచన అందించాడు లారెన్స్. ఈ సినిమా మాత్రం ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా అర్థనారీశ్వరి పాత్రలో శరత్ కుమార్, లారెన్స్ నటనకు కాసుల వర్షం కురిసింది. ఆ సినిమాకు సిక్వెల్ గా 2015లో వచ్చిన గంగ (కాంచన 3) కూడా సూపర్ హిట్ అయింది.
ఇప్పుడు ఆ హిట్ ఫ్రాంఛైజీలో ఫోర్త్ చాప్టర్‌కి సైన్ చేశారట బుట్ట బొమ్మ పూజ హెగ్డే. సౌత్‌లో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ కోసం ట్రై చేస్తున్న పూజా హెగ్డే కి కాంచన పర్ఫెక్ట్ మూవీ అంటున్నారు క్రిటిక్స్. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన పూజా హెగ్డే వరుసగా ఐదు ఫ్లాప్స్ చవిచూసింది. ఇప్పుడు త్వరలో సూర్య నటించిన రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోపాటు నాలుగు మూవీస్‌తో స్ట్రాంగ్ లైనప్‌తో 2025లో ముందుకు రానుంది బుట్టబొమ్మ.గత కొంతకాలంగా పూజా హెగ్డేకు వరుస ఫ్లాప్‌లు దర్శనం ఇచ్చాయి.
అలాగే, తనను ఐరన్ లెగ్ అంటూ కొన్ని సినిమాల నుంచి కూడా పక్కకు తప్పించినట్లు జోరుగా వార్తలు వచ్చాయి.యావరేజ్‌గా నిలిచిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా తర్వాత పూజా హెగ్డే.. ప్రభాస్‌తో రాధేశ్యామ్, దళపతి విజయ్‌తో బీస్ట్, చిరంజీవి-రామ్ చరణ్ ఆచార్య సినిమాలు చేసింది. అయితే, అవన్ని బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచాయి. ఇప్పుడు కాంచన 4 తో పూజ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఇప్పటికే త్రిష, హన్సిక, రాశిఖన్నా, తమన్నా లాంటి గ్లామర్ హీరోయిన్స్ హారర్ సినిమాల్లో నటించి హిట్స్‌ను అందుకున్నారు.
మరి పూజా హెగ్డేకు కూడా ఈ హారర్ ఫార్ములా ఏమైనా సక్సెస్ ఇస్తుందేమో చూడాలి. ఇకపోతే ఈ కాంచన 4 సినిమా కోసం ప్రముఖ బాలీవుడ్ సంస్థ గోల్డ్ మైన్స్ రూ.100 కోట్లకుపైగా బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమైందట. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైందని, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. మరోవైపు చంద్రముఖి 2తో భారీ డిజాస్టర్ అందుకున్న లారెన్స్ ఈ కాంచన 4తో తన స్వీయ దర్శకత్వంలో బలమైన కంబ్యాక్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు.