Dil Ramesh: ఆ విషయంలో ఇండస్ట్రీకి ధైర్యం బాలయ్య మాత్రమే… ఆర్టిస్ట్ దిల్ రమేష్ కామెంట్స్!

Dil Ramesh: తాను అఖండ సినిమాకు సంబంధించి 3 రోజులు మాత్రమే పని చేశానని, హిందూయిజం మీద, హిందుత్వం మీద నమ్మకం ఉండి గుడి విలువ తెలియజెప్పే, ప్రతీ ఒక్కరూ స్టేటస్‌లో పెట్టుకునే సీన్ అది అని ఆర్టిస్ట్ దిల్ రమేశ్ అన్నారు. తనకు ఈ మధ్య కాలంలో తక్కువ సీన్లు చేసినది బాలకృష్ణ గారితోనేనని, బాలకృష్ణ గారితో ఐ టూ ఐ కాంటాక్ట్‌లో చెప్పిన సీన్ తనకు ఇచ్చినందుకు బోయపాటి గారికీ, ఆయనతో ఉండి తనకు సహకరించి వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని ఆయన చెప్పారు. అంతే కాకుండా ఫ్యాన్స్ కూడా ఆ సీన్‌ను బాగా ఎంజాయ్ చేశారని ఆయన తెలిపారు. ఆ సీన్ చేసేటపుడే బాలకృష్ణ గారు తనను మెచ్చుకున్నారని ఆయన అన్నారు.

ఇకపోతే కరోనా కారణంగా అప్పటివరకూ థియేటర్స్‌కు వెళ్లకుండా ఉన్న వారందర్నీ కూడా రప్పించింది అఖండ సినిమా అని ఆయన గర్వంగా చెప్పారు. ఈ మధ్య కాలంలో ఒక సినిమాను 4,5 సార్లు చూసిన ఆడియన్స్ అసలు ఉండట్లేదని, కానీ అఖండ సినిమాను మాత్రం 4,5 సార్లు చూసి 50 రోజుల పాటు దిగ్విజయంగా నడిపించారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇదంతా ఒక ఎత్తైతే మంచి సినిమా తీస్తే థియేటర్లకు వెళ్లి చూస్తారని నిరూపించింది ఈ సినిమా అని ఆయన కొనియాడారు. అంతే కాకుండా ఈ సినిమా ఇండస్ట్రీ విల్ పవర్‌ను పెంచిందని ఆయన చెప్పారు. అంత వరకూ థియేటర్లకు వస్తారని నమ్మకం లేదని, ఎందుకంటే ఓటీటీ ఫ్లాట్‌పామ్స్ వచ్చాక అలా వచ్చే వారి సంఖ్య చాలా తగ్గిపోయిందని, అంతంత డబ్బులు పెట్టి ప్రేక్షకులు చూడరని అనుకున్న తమకు, ఈ సినిమా వచ్చాక తమలో ఆ భావనలన్నింటినీ పోగొట్టి ఒక ధైర్యాన్ని నింపిందని ఆయన చెప్పారు.

దాని తర్వాత పుష్ప, శ్యామ్ సింగరాయ్‌ లాంటి సినిమాలు కూడా వచ్చాయని అవి కూడా బాగానే ఆడాయని దిల్ రమేశ్ అన్నారు. ఇవన్నీ కరోనా వల్ల సృష్టించబడ్డాయి గానీ, కరోనా తగ్గిన తర్వాత మళ్లీ థియేటర్లకు వెళ్లకుండా ఉండరని, ప్రేక్షకులు సినిమాను థియేటర్లలోనే ఎంజాయ్ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. వీటన్నింటికీ కారణం అఖండ సినిమానే అని, మంచి సినిమా తీస్తే ఎవరైనా చూస్తారు అని, హిట్ చేస్తారు అని ఈ సినిమా నిరూపించిందని, ఇండస్ట్రీకి ఒక బలాన్నిచ్చిందని ఆయన వివరించారు.