Gallery

Home News బాలయ్య బిబి 3 లో క్రిష్ హీరోయిన్ .. స్టార్ హీరోయిన్ ని వద్దంటున్నారు ..?

బాలయ్య బిబి 3 లో క్రిష్ హీరోయిన్ .. స్టార్ హీరోయిన్ ని వద్దంటున్నారు ..?

బోయపాటి శ్రీను, నట సింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తయారవుతున్న హ్యాట్రిక్ సినిమా ఈ నెలలో సెట్స్ మీదకి వచ్చింది. నాన్ స్టాప్ గా షూటింగ్ జరిపి టాకీపార్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. ఇంతక ముందు బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’ ‘లెజెండ్’ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు తయారవుతున్నబిబి 3 పై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన బిబి3 టీజర్ తో సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతోంది.

Balakrishna Roared With The Dialogue In 'Bb3 First Roar'

కాగా ఈ సినిమా ని ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఇంతక ముందు బోయపాటి – రవీందర్ రెడ్డి కలిసి సినిమా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి ‘మోనార్క్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. అయితే ఇంకా ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య బిబి3 లో బాలయ్య కి జంటగా మలయాళ హీరోయిన్స్ ప్రయాగ మార్టిన్ ‘అవును’ ఫేమ్ పూర్ణ ని హీరోయిన్స్ గా తీసుకున్నారని వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ప్రయాగ మార్టిన్ ప్లేస్ లో క్రిష్ దర్శకత్వంలో నటించిన కంచె హీరోయిన్ ని తీసుకోబోతున్నారని అంటున్నారు. కంచె సినిమాలో నటించిన ప్రగ్యా జైస్వాల్ మంచి పేరు సంపాదించుకుంది. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంది. అందుకే ప్రగ్యా జైస్వాల్ ని బిబి3 లో తీసుకోనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలో రానుందని తెలుస్తుంది. అయితే గత కొన్నాళ్ళుగా అసలు బాలయ్య సినిమాకి హీరోయిన్ సమస్య రావడం ఏంటని అందరూ ఆలోచిస్తున్నారు.

కాగా బాలయ్య సినిమాలో నయన తార, త్రిష లాంటి స్టార్ హీరోయిన్స్ ని తీసుకుంటే బడ్జెట్ లెక్కలు మారిపోతాయన్న ఆలోచనతోనే స్టార్ హీరోయిన్స్ జోలికి వెళ్ళడం లేదట. ఇక ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక రీసెంట్ గా హీరోయిన్ పూర్ణ కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ అయిందని సమాచారం. నవంబర్ 16 నుంచి బాలయ్య కూడా షూటింగ్ లో జాయిన్ కానున్నారట. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు.

- Advertisement -

Related Posts

పవన్ గురించి రానా ఆసక్తికర కామెంట్స్

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్ మీద భారీ క్రేజ్ నెలకొని ఉంది. ఈ మూవీ రెండు పాత్రల మధ్య హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంటుంది. మరి...

కరోనా మూడో వేవ్: కేరళకు ఏమయ్యింది.?

దేశంలోకి మొదట కరోనా వైరస్ ప్రవేశించిందే కేరళ రాష్ట్రం ద్వారానే. చైనా నుంచి వచ్చిన ఓ కేరళ వ్యక్తి కరోనా వైరస్‌ని దేశంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత దేశంలో కరోనా వైరస్ విస్తరించడానికి...

కేంద్రం కాఠిన్యం: విశాఖ ఉక్కు పరిశ్రమపై వారికి హక్కు లేదా.?

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయమై కేంద్రం రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కేంద్రం పేర్కొన్న అంశాలతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు, కార్మికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.....

Latest News