టాలీవుడ్ సీనియర్ హీరో తో ఇలియాన రొమాన్స్ ..ఈ ఛాన్స్ వస్తుందని ఎవరూ ఊహించలేదు ..?

అక్కినేని నాగార్జున మన్మధుడు 2 వంటి భారీ డిజాస్టర్ తర్వాత మరోసారి పోలీస్ అధికారిగా ‘ వైల్డ్ డాగ్ ‘ అనే సినిమాలో నటిస్తున్నాడు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ గా కనించబోతున్నాడు.

Nagarjuna Announces His Next Project 'Wild Dog' With a Cool Poster, Cop  Film Goes on Floors (See Pic) | 🎥 LatestLY

ఇక ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీటయిన ఈ సినిమా నుండి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ప్రస్తుతం ఇటీవలే సెట్స్ మీదకి వెళ్ళిన ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న బ్రహ్మాస్త్ర లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ప్రస్తుతం బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు నాగార్జున.

కాగా త్వరలో మరో రెండు ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేయబోతున్నట్టు తాజా సమాచారం. అందులో ఒకటి సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్. గతంలో నాగార్జున డ్యూయల్ రోల్ లో నటించి హిట్ అందుకున్న సినిమా సోగ్గాడే చిన్ని నాయనా. ఈ సినిమా సీక్వెల్ బంగార్రాజు త్వరలో మొదలబోతుందని తెలుస్తుంది. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషంచనుండగా నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటించనున్నాడని సమాచారం. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాని తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ సీక్వెల్ ని తెరకెక్కించనున్నాడు.

Making of Raid #5 - Fun On Sets | Ajay Devgn | Ileana D'Cruz - YouTube

ఇక బాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన రైడ్ సినిమాని తెలుగులో నాగార్జున తో రీమేక్ చేయబోతున్నట్టు ఇంతకముందే వార్తలు వచ్చాయి. బాలీవుడ్ లో ఈ సినిమాలో అజయ్ దేవగన్ కి జంటగా నటించిన గోవా బ్యూటీ ఇలియాన తెలుగు రీమేక్ లోను నాగార్జున కి జంటగా నటించనుందని సమాచారం. చాలాకాలం తర్వాత రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని తో రీ ఎంట్రీ ఇచ్చినప్పటికి హిట్ మాత్రం దక్కలేదు. చూడాలి మరి నాగార్జున ఇలియాని కి బ్రేక్ ఇస్తాడేమో.