తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి మెగా ఫ్యామిలీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక మెగా కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మెగా వారసుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే రామ్ చరణ్ వ్యక్తిగత విషయానికి వస్తే ఉపాసనను ప్రేమించి 10 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నప్పటికీ ఇంకా ఈ దంపతులకు పిల్లలు లేరు.
అయితే వచ్చే యేడాది ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుందని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన కోడలు గర్భవతి అనే విషయాన్ని అధికారకంగా ప్రకటించారు. ఇక ఈ విషయం తెలిసిన మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో తమ సొంత వదిన ప్రెగ్నెంట్ అనే ఆనందంలో మెగా అభిమానులు ఈ విషయంలో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇకపోతే తన కోడలు తల్లి కాబోతుందని విషయం తెలియగానే చిరంజీవి చేసిన పని తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
అందరిలాగే మెగాస్టార్ చిరంజీవి సైతం తన వారసుడి కోసం ఎదురుచూశారు. అయితే ఈ విషయాన్ని ఎక్కడ బయటకు చెప్పకుండా ఉపాసన రాంచరణ్ వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళిష్టం అంటూ బయటకు చెప్పారే కానీ ఎప్పుడూ కూడా తన కోడలిని తమకు వారసుడు కావాలని ప్రశ్నించింది లేదు. అయితే ఈమె తల్లి కాబోతున్నారనే విషయం ఇంట్లో చెప్పగానే వెంటనే చిరంజీవి సంతోషం వ్యక్తం చేస్తూ ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయడమే కాకుండా సింధూరం తెచ్చి తన కోడలి నుదుటిన పెట్టి ఆశీర్వదించారట. చిరంజీవి సైతం బుల్లి మెగాస్టార్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.