అక్కినేని నాగార్జున ఆస్తి విలువ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

అక్కినేని నాగార్జున టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరు. ఇతను ప్రఖ్యాత నటులైన అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని అన్నపూర్ణ లకు 29 ఆగస్టు 1959లో మద్రాసు (చెన్నై) లో జన్మించారు. 1986లో విక్రమ్ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమ లో అడుగుపెట్టిన ఈయన ఎన్నో మైలురాళ్లు దాటి యువ సామ్రాట్ గా ఎదిగారు. అంతే కాకుండా కొన్ని సినిమాలను స్వయంగా నిర్మించారు. నాగార్జున కు1984లో దగ్గుపాటి లక్ష్మితో వివాహం జరిగింది. నాగార్జున దగ్గుబాటి లక్ష్మి కు అక్కినేని నాగచైతన్య కుమారుడు. తరువాత 1990 లో విడాకులు తీసుకున్నాక 1992లో అమలతో వివాహం జరిగింది. నాగార్జున అమలకు అక్కినేని అఖిల్ కుమారుడు. దాదాపుగా మూడు దశాబ్దాలు గా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకొని కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా తనదైన క్రేజ్ లో దూసుకుపోతున్నారు.

అంతేకాకుండా అక్కినేని నాగార్జున బుల్లితెరపై పలు షోలకు హోస్ట్ గా పని చేస్తున్నాడు. కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేస్తున్నాడు. ఇలా తనదైన శైలిలో దూసుకుపోతున్న నాగార్జున ఆస్తులను భారీగా కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈయన సినిమాలు మాత్రమే కాకుండా ఎన్నో రకాల వ్యాపారాలను కూడా ప్రారంభించినట్లు సమాచారం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నాగార్జున భారీగానే సంపాదిస్తున్నారట. ఇక హైదరాబాదులో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన అన్నపూర్ణ స్టూడియో కొన్ని వందల కోట్ల విలువ చేస్తుందని చెప్పాలి.

ఈ విధంగా నాగార్జున సినిమాలు బుల్లితెర షోస్,పలు బ్రాండ్లకు ప్రమోటరుగా వ్యవహరిస్తూ సుమారు 5 వేల కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా నాగార్జున సినిమా ఇండస్ట్రీలో అత్యధిక ఆస్తుపాస్తులు కలిగిన వారిలో ఈయన ఒకరిని చెప్పాలి.ఇక ప్రస్తుతం ఈయన ఆరుపదుల వయసులో ఉన్నప్పటికీ కూడా యంగ్ హీరోలకు పోటీగా ముఖ్యంగా ఆయన కొడుకులకు పోటీగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.