సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు ఎంతో ఖరీదైన వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా ఎన్నో రకాల బ్రాండ్లకు చెందిన వస్తువులను ఉపయోగించడం మనం చూస్తున్నాము. అయితే ఇలాంటి బ్రాండెడ్ వస్తువులు కొన్ని లక్షలలో విలువ చేస్తూ ఉంటాయి. చూడటానికి సాధారణంగా అనిపించిన కొన్ని వస్తువులు ఖరీదు మాత్రం లక్షల విలువలు చేయడం గమనార్హం .ఈ క్రమంలోనే మెగా వారసుడు రామ్ చరణ్ ఎప్పటికప్పుడు బ్రాండెడ్ వస్తువులను ధరించి తరచు వార్తల్లో నిలుస్తుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా తన భార్య ఉపాసన మరియు ఇతరులతో కలిసి రాంచరణ్ దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి. అయితే ఇందులో రామ్ చరణ్ జీబ్రాలు ఉన్నటువంటి చొక్కా ధరించారు. దీంతో అందరి దృష్టి అతని చొక్కాపై పడింది.ఈ క్రమంలోనే రామ్ చరణ్ ధరించిన ఈ చొక్కా ఖరీదు ఎంత అని నెటిజెన్స్ ఆరాధిస్తున్నారు.
రామ్ చరణ్ ధరించిన ఈ షర్ట్ డోల్స్ అండ్ గబ్బానా జీబ్రా ప్రింట్ షర్ట్ ఇది. ఆన్లైన్ సమాచారం ప్రకారం.. ఈ షర్ట్ ధర అక్షరాల రూ. 1,73,326. అయితే కేవలం షర్ట్ లే కాకుండా ఈయన షూస్ వాచీలు వంటివి కూడా లక్షల విలువ చేసే ఖరీదైన బ్రాండ్లను ఉపయోగిస్తూ ఉంటారు. మొత్తానికి రామ్ చరణ్ ధరించిన ఈ చొక్కా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.