వాయమ్మ పవన్ కళ్యాణ్ నటించిన ఈ షోస్ ధర తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం… ఎంతనో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు రాజకీయ పనుల నిమిత్తం ఎంతో బిజీగా గడుపుతూ సినిమాలకు కాస్త దూరమయ్యారు. అయితే ప్రస్తుతం రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చి ఈయన కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోని తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరు మల్లు వర్క్ షాప్ పని నిమిత్తం పవన్ కళ్యాణ్ హాజరు అయ్యారు. ఈ సినిమా పని నిమిత్తం పవన్ క్యాజువల్ వేర్ లో వచ్చారు. రెడ్ కలర్ టీషర్ట్ జీన్స్ ప్యాంట్ ధరించి ఎంతో హ్యాండ్సమ్ గా కనిపించడంతో అభిమానులు పవన్ కళ్యాణ్ లుక్ ఫిదా అవుతూ ఈ గెటప్ లో కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల ఆయన ఎక్కువగా తెల్ల దుస్తులను ధరించి కనిపిస్తున్నారు అయితే తాజాగా టీషర్ట్ జీన్స్ ప్యాంట్ లో కనిపించడంతో అభిమానులు మాత్రం పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ ధరించిన షూస్ పై అభిమానులు కన్ను పడింది.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ధరించిన షూస్ ధర ఎంత అంటూ పెద్ద ఎత్తున షూస్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.అయితే పవన్ కళ్యాణ్ ధరించిన ఆ షూస్ ఖరీదు తెలిసి ఒక్కసారిగా అభిమానులు కంగుతిన్నారు. పవన్ కళ్యాణ్ ధరించిన ఈ షూస్ కోపెన్ హాగన్ బ్రాండ్ కు చెందినవి ఈ షూస్ అక్షరాల 11994 యూరోలు. ఇండియన్ కరెన్సీలో రూ. 9.6 లక్షలు. అంటే పవన్ కళ్యాణ్ ధరించిన షూస్ దాదాపు పది లక్షల కావడంతో ఒక్కసారిగా నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ధరించిన షూస్ తో ఒక మధ్య తరగతి కుటుంబం లగ్జరీ ఇంటిని నిర్మించుకోవచ్చు అని కామెంట్లు చేస్తున్నారు.