టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్నటువంటి క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ కుటుంబంలో ఒకరిగా పేరు సంపాదించుకున్నటువంటి మెగా బ్రదర్ నాగబాబు గురించి పరిచయం అవసరం లేదు.చిరంజీవి పవన్ కళ్యాణ్ మాదిరిగా ఇండస్ట్రీలో నటుడుగా కొనసాగ లేకపోయినా ఈయన మాత్రం నిర్మాతగా, పలు సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ సందడి చేశారు. అలాగే బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ తాను కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతుండగా కూతురు నిహారిక సైతం బుల్లితెర యాంకర్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం హీరోయిన్ గా పలు సినిమాలలో నటించారు. అయితే ఈమె నటించిన సినిమాలు పెద్దగా గుర్తింపు తీసుకురాకపోవడంతో 2020 డిసెంబర్ నెలలో జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.వివాహం తర్వాత కూడా నిహారిక సినిమాలపై ఉన్న ఫ్యాషన్ తగ్గకపోవడంతో ఈమె సినిమాలలో నటించకుండా వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా మారిపోయారు.
ఇక నిహారిక వివాహం జరిగి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో నాగబాబు తన కూతురికి ఎంత మొత్తంలో కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేశారనే విషయం గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నాగబాబు నిహారిక పెళ్లి సమయంలో తన కాబోయే అల్లుడికి సుమారు 20 కోట్ల వరకు కట్నం ఇచ్చినట్టు సమాచారం అదేవిధంగా వీరి వివాహాన్ని కూడా ఎంతో అంగరంగ వైభవంగా రాజస్థాన్లోని ఒక పురాతన కోటలో జరిపించారు.వీరి వివాహానికి కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటారు. అలాగే నిహారిక పెళ్లి కోసం ఐదు కోట్లు విలువచేసే బంగారు ఆభరణాలను కొనుగోలు చేశారని అలాగే తన అల్లుడికి కారు, ఇల్లు కూడా బహుమతిగా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి నాగబాబు తన కూతురి కోసం భారీగానే ఖర్చు చేసినట్టు తెలుస్తుంది.