టైం ట్రావెల్ చేసే అవకాశమే వస్తే అలా ఉండాలని కోరుకుంటా… శర్వానంద్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ శతమానం భవతి సినిమా తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ ఈయనకి ఈ సినిమా హిట్ అందుకున్న స్థాయిలో మరి సినిమాలు హిట్ పడలేదని చెప్పాలి. ఇలా శతమానం భవతి సినిమా తర్వాత ఒకే ఒక జీవితం సినిమాతో శర్వానంద్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. టైం ట్రావెల్ కథాంశంతో శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాలో శర్వానంద్ రీతు వర్మ జంటగా నటించిన అక్కినేని అమల శర్వానంద్ తల్లి పాత్రలో నటించారు.ఇక ఈమె కూడా తన పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిందని ఈ సినిమా మదర్ సెంటిమెంట్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి.ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శర్వానంద్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ ఈ సినిమా కథను బలంగా నమ్మి ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకంతోనే చేసాము. అనుకున్న విధంగానే ఈ సినిమా కి ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యారని శర్వానంద్ వెల్లడించారు.టైం ట్రావెల్ కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా ప్రేక్షకులు ఆదరించినప్పటికీ విమర్శకుల నుంచి సమస్య ఎదురవుతుందని భావించాం. లక్కీగా వారికి కూడా ఈ సినిమా నచ్చిందని తెలిపారు. ఇక ఈ సందర్భంగా ఒకవేళ మీకు టైం ట్రావెల్ చేసే అవకాశం వస్తే ఎక్కడికి వెళ్లాలని కోరుకుంటారని ప్రశ్నించగా ఈయన తాను ఇంటర్ చదివే రోజుల్లోకి వెళ్లాలని కోరుకుంటా అంటూ సమాధానం చెప్పారు. తాను ఇంటర్ చదివే రోజులు తన లైఫ్ లో హ్యాపీ డేస్ అని అలాంటి గోల్డెన్ మూమెంట్స్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటా అంటూ సమాధానం చెప్పారు.