పుష్ప సినిమా లేకపోతే మరో 20 సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చేది.. అల్లు అర్జున్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప. డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో విజయం సొంతం చేసుకుంది. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొంది ప్రేక్షకుల ప్రేమాభిమానాలు సొంతం చేసుకున్నాడు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అర్జున్ పుష్ప సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుష్ప సినిమా విడుదలై భారీ స్థాయిలో విజయం సొంతం చేసుకోవటం ఆశ్చర్యాన్ని కలిగించిందని బన్నీ చెప్పుకొచ్చాడు. పుష్ప సినిమాలో నటించకపోతే ఈ స్థాయిలో ప్రేక్షకుల ప్రేబాభిబానాలు సొంతం చేసుకోవడానికి మరో 20 సంవత్సరాలు పట్టేది అంటూ వెల్లడించాడు.

పుష్ప సినిమా హిట్ అవ్వటంతో పుష్ప 2 సినిమా మీద కూడా ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయని వారి అంచనాలకు తగ్గట్టుగానే పుష్ప 2 సినిమా ఉండేలా ప్రయత్నిస్తామని బన్నీ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న పుష్ప 2 సినిమా అక్టోబర్ ఒకటవ తేదీ అల్లు రామలింగయ్య గారి 100 వ జయంతి సందర్భంగా కొత్తగా ప్రారంభించనున్న అల్లు స్టూడియోస్ లో పుష్ప2 సినిమా షూటింగ్ కూడా ప్రారంభించనున్నారు.