RGV: రాజమౌళి దగ్గర డేంజరస్ బాయ్స్ ఉంటే, నా దగ్గర డేంజరస్ అమ్మాయిలు ఉన్నారు: వర్మ

RGV: ఇటీవల రిలీజైన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం చూసిన కాంట్రవర్షియల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన రివ్యూ మొన్నటి దాకా సోషల్ మీడియాలో హల్ చల్‌ చేసిన విషయం తెలిసిందే. ఎప్పుడూ విమర్శలకు తావిచ్చే కామెంట్స్ చేస్తూ, వివాదాలతో కూడిన సినిమాలు చేస్తూ వార్తల్లో నిలిచే ఆర్జీవీలో ఈ మధ్య కాలంలో వస్తున్న మార్పును చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈయనేనా ఇలా మాట్లాడేది ? ఈయనేనా ఇలా చేసింది ? అనే విధంగా ప్రవర్తిస్తూ, ఎలాగైతేనేం ఏదో ఒక విధంగా సంచలనంగా మారుతున్నారు.

ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూశాక అసలు తనకు మాటలు కరువయ్యాయని ఆర్జీవీ చెప్పడం చూసి, ప్రేక్షకులంతా ఇదంతా నిజమేనా అన్నట్టు సందేహం వ్యక్తం చేశారు. కొన్ని సార్లు ఆయన చేసే ట్వీట్లు కూడా అసలు తిడుతున్నాడా ? పొగుడుతున్నాడా ? కూడా అర్థం కాని సిచ్యువేషన్‌ను క్రియేట్ చేయడం ఆర్జీవీకే చెల్లుతుందని టాక్ కూడా లేకపోలేదు.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వర్మ, తాజాగా మరో పోస్ట్ చేసి వైరల్‌గా మారాడు. మీకు రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి డేంజరస్ బాయ్స్ ఉంటే, నాకు అప్సర రాని, నైనా గంగూలీ వంటి డేంజరస్ అమ్మాయిలు ఉన్నారంటూ ఆర్ ఆర్ ఆర్ త్రయం ఉన్న ఫోటోకు, తమ ముగ్గురి ఫోటోను కంపేర్ చేస్తూ పోస్ట్ చేశాడు వర్మ. ఇక ఇటీవల సెన్సేషనల్ రివ్యూ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు ఈ మూవీ సక్సెస్ కాగానే తన సినిమా ప్రమోషన్స్ కోసం ఆర్ ఆర్ ఆర్ సినిమాను బాగానే వాడుకుంటున్నాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే ఆర్జీవీ ఇటీవల తెరకెక్కించిన చిత్రం డేంజరస్. అదే తెలుగులో నా ఇష్టం అనే పేరుతో విడుదల కాబోతుంది. కాగా లెస్బియన్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమాలో నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పలు బాధల్లో ఏప్రిల్ 8న విడుదల కానున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ ను ఆర్జీవీ ఇలా కొత్తగా ప్లాన్ చేసాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ద‌ర్శకుడు రాజ‌మౌళి, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ల‌ను త‌న మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం వాడుకున్నారు మ‌రో ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ‘వెల్ రాజమౌళి సార్. మీకు తారక్, రామ్ చరణ్ వంటి డేంజరస్ బోయ్స్ ఉంటే… నాకు నైనా గంగూలీ, అప్సర రాణి వంటి డేంజరస్ గర్ల్స్ ఉన్నారు’ అని ట్వీట్ చేశారు. అంతేకాదు చరణ్, రాజమౌళి, తారక్ కలిసి ఉన్న ఫొటోతో పాటు… అప్సర, నైనాలతో తాను కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.వర్మ తెరకెక్కించిన ‘మా ఇష్టం (డేంజరస్)’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అప్సర రాణి, నైనా గంగూలీలతో వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లెస్బియనిజం కథాంశంతో ఈ చిత్రాన్ని వర్మ రూపొందించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వర్మ బిజీగా ఉన్నారు. ప్రమోషన్ లో భాగంగా వర్మ ఏ అంశాన్ని వదలడం లేదు. అన్ని అంశాలను తన సినిమా ప్రమోషన్ కు వాడుకుంటున్నారు.