అల్లు అర్జున్ సినిమా వరుడు సినిమాలో హీరోయిన్ గా నటించిన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది భాను శ్రీ మెహ్ర. ఈమె మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ లో ఓ రేంజ్ కి వెళ్ళిపోతుంది అనుకున్నారు అందరూ ఆ సినిమా ఫ్లాప్ కావటం వలనో ఏమో కానీ ఆ తర్వాత కెరియర్ పరంగా ఆమెకి మంచి సక్సెస్ దక్కలేదు.
దాంతో ఆమె ఐదేళ్ల క్రితం కిరణ్ మానస్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని సెటిల్ అయిపోయింది. ఇక అసలు విషయంలోకి వస్తే భాను శ్రీ మెహ్ర సోదరుడు నందు గడిచిన ఏడు రోజుల క్రితం మరణించాడంట, ఈ విషయం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది భాను. నిజానికి భాను తమ్ముడు వయసు చాలా చిన్నది, కానీ అనారోగ్య కారణాల వలన అతను చనిపోయాడంట. ఇంకా ఆమె ఏం రాసిందంటే తన తమ్ముడు మరణించి ఇప్పటికీ ఏడు రోజులు అయింది.
ఇది పీడకల అయితే బాగుండు అని తెలిపింది. ఈ నిజాన్ని ఎలా నమ్మాలి, నువ్వు గుర్తుకు వస్తున్నావు నువ్వు లేవనే విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. తన మనసులో ఎప్పటికీ తనకి చోటు ఉంటుంది ఐ మిస్ యు నందు అంటూ తను కుటుంబంతో కలిసి గడిపిన కొన్ని ఫోటోలని వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది భాను శ్రీ మెహ్రా. అయితే విషయం తెలుసుకున్న అభిమానులు ఆమెకి సానుభూతి తెలియజేస్తూ ధైర్యం కూడా చెప్తున్నారు.
ఇక భాను శ్రీ విషయానికి వస్తే ఆమె బచానే హసీనా అనే సినిమాతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది. తన కెరీర్ లో సుమారు 15 పైగా చిత్రాలలో నటించింది. తెలుగులో ఆమె వరుడు కాకుండా చిలుకూరు బాలాజీ, ప్రేమతో చెప్పనా, మహారాజశ్రీ గాలిగాడు, లింగడు రామలింగడు, బ్రదర్ అఫ్ బొమ్మాళి, గోవిందుడు అందరివాడేలే వంటి కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు గా చేసింది ఈ భామ. ఇక ఆమె చివరిగా నటించిన సినిమా టెన్త్ క్లాస్ డైరీస్. ఈ సినిమా 2022లో విడుదలైంది.