ఆ సినిమాలో నా పాత్ర కోసం నవల మొత్తం చదివాను.. త్రిష…?

Trisha

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు పొంది.. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకొని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్ భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన త్రిష ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ఇటీవల ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో కూడా రాకుమారి కుందవై పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాని మణిరత్నం తెరకెక్కించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్, త్రిష , కార్తీ, చియాన్ విక్రమ్, జయం రవి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 30 న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో త్రిష మాట్లాడుతు.. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టగానే కరోనా కారణంగా ప్రపంచం మొత్తం లాక్ డౌన్ అయ్యింది. ఆ సమయంలో ఈ సినిమాలో నా పాత్రని అర్థం చేసుకోవటానికి కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల మొత్తం చదివాను . 5 భాగాలు ఉన్న ఈ నవలని మణిరత్నం రెండు భాగాలలో తీయటానికి సిద్ధమయ్యారు అంటూ చెప్పుకొచ్చింది.