ఆ సినిమాను వదులుకొని చాలా తప్పు చేశాను : మెహరీన్

టాలీవుడ్ ముద్దుగుమ్మ మెహరీన్ గురించి మనందరికీ తెలిసిందే. హీరో న్యాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈమెకు సరైన గుర్తింపు దక్కలేదు. కానీ ఈ అమ్మడు క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సినిమాలలో తన అందం అభినయంతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తు ఉంటుంది మెహరీన్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు ఏర్పరచుకోవడంతో ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు తలుపు తట్టాయి.

అలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేసులో చేరిపోయింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఎఫ్ 2 సినిమా కంటే ముందు సాలిడ్ సక్సెస్ దక్కలేదు. వచ్చిన ప్రతి సినిమా చేసుకుంటూ పోవడంతో ఈ ముద్దుగుమ్మ కెరీర్లో హిట్లు తక్కువ అయ్యాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్ 2 ఈ సినిమాతో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్ 3 సినిమాలో హీరోయిన్ గా నటించింది. మెహరీన్ ఆశలు అన్నీ కూడా ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాపైనే పెట్టుకుంది.

అయితే ఈమెకు వరుసగా ఫ్లాప్ లో ఉన్న సమయంలో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమాలో అవకాశం వచ్చిందట.. కానీ ఆ అవకాశాన్ని వదులు ఉందట. కానీ ఆ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అయిన తరువాత ఆ సినిమాను వదులుకున్నందుకు చాలా ఫీల్ అయిందట. అదే సమయంలోనే భవ్య బిష్ణయ్ తో జరిగిన నిశ్చితార్థం కూడా రద్దు చేసుకుంటున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. ఆతరువాత గ్యాప్ లేకుండా సినిమాలు ఒప్పుకుంది. మరి ఎఫ్ 3 సినిమా తన కెరీర్ కు మరింత ప్లస్ అవుతుందని ఈ ముద్దుగుమ్మ భావిస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి మరి.