నేనెప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు.. సినిమా కోసం ఎన్నో వదులుకున్నా: పూజా హెగ్డే

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటి పూజా హెగ్డే. ఈమె కెరీయర్ మొదట్లో వరుస ఫ్లాప్ సినిమాలలో నటించినప్పుడు చాలామంది ఈమెను ఐరన్ లెగ్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. అయితే తనపై పడిన ఈ ముద్రను చరుపుకొని ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పూజా హెగ్డే తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తనని కెరియర్ మొదట్లో చాలా మంది ఐరన్ లెగ్ అని పిలిచారు. అయినా నేను వాటిని పెద్దగా తీసుకోలేదు. ఆరోజు ఐరన్ లెగ్ అని పిలిచిన వాళ్లే నేడు నెంబర్ వన్ హీరోయిన్ అని పిలుస్తున్నారు. అయితే నేను నేడు ఈ స్థాయిలో ఉండడానికి ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు.సినిమా ఇండస్ట్రీలో ఈ స్థాయికి రావడానికి తాను ఎన్నో వదులుకున్నానని చివరికి కుటుంబంతో కూడా సరైన సమయం గడపలేదంటూ ఈ సందర్భంగా కెరీర్ కోసం తను పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇక ఇండస్ట్రీలోకి ప్రస్తుతం తనని స్టార్ హీరోయిన్ అని పిలుస్తున్నారు. అయితే ఈ స్టార్ డమ్ అనేది ఎవరికి శాశ్వతం కాదని, ఇలా తాను ఒక స్టార్ అనే పొగరును తనెప్పుడు తలకెక్కించుకోలేదు, అసలు తనకు స్టార్ అనే పదమే నచ్చదు అంటూ ఈ సందర్భంగా ఈమె తన కెరీర్ గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు.