నాకు అలాంటి గాడ్ ఫాదర్ ఎవరూ లేరు.. ఎమోషనల్ అయిన నిఖిల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు నిఖిల్.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకున్న నిఖిల్ అనంతరం పలు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేదు. ఇకపోతే ఈయన నటించిన సినిమాలలో స్వామి రారా కార్తికేయ సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఇకపోతే కార్తికేయ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కార్తికేయ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇటు సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఇకపోతే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున పార్టీ జరుపుకున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ ఒక ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా తన సినిమా మంచి హిట్ కావడంతో ఎమోషనల్ అయిన నిఖిల్ తన కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బయటపెట్టారు.తనకు సినిమా ఇండస్ట్రీలోకి రావడమే చాలా కష్టంగా మారింది అలాంటి తనకు ఇలాంటి సక్సెస్ రావడం నిజంగా చాలా అదృష్టం అని తెలిపారు. నాకు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేదు దాంతో ఇండస్ట్రీలోకి రావడమే కష్టంగా మారిందని తెలిపారు.

అందరిలా నాకు ఓ గాడ్ ఫాదర్ ఉంటే బాగుండేదని ఈ సందర్భంగా ఈయన ఎమోషనల్ అయ్యారు.హ్యాపీ డేస్ సినిమా హిట్ అయిన తర్వాత తనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి అయితే ఎలాంటి కథలను ఎంపిక చేసుకోవాలో తెలియక వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్ సినిమాలలో నటించానని సరైన గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేకపోవడం వల్లే తాను అలాంటి కథలను ఎంపిక చేసుకున్నానని ఈ సందర్భంగా నిఖిల్ ఎమోషనల్ అవుతూ ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం నిఖిల్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.