గాంధీజీ గొప్పవారని నేను అనుకోలేదు – రాహుల్ రామకృష్ణ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు రాహుల్ రామకృష్ణ. పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్నటువంటి ఈయన అర్జున్ రెడ్డి సినిమాతో ఎంతో ఫేమస్ అయ్యారు. ఇలా ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో అనంతరం గీతాగోవిందం, భరత్ అనే నేను, బ్రోచేవారెవరురా, జాతి రత్నాలు వంటి సినిమాల ద్వారా మంచి హిట్ అందుకున్నారు.

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటికే ఈయన ఎన్నో వివాదాస్పదమైన ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలువగా,తాజాగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈయన ట్విట్టర్ వేదికగా చేసినటువంటి ట్వీట్ క్షణాల్లో వైరల్ గా మారింది. అయితే వెంటనే ఈయన ఈ ట్వీట్ డిలీట్ చేశారు. ఇంతకీ ఈయన చేసిన ట్వీట్ ఏంటి అనే విషయానికి వస్తే…

గాంధీ జయంతి రోజున ప్రతి ఒక్కరూ జాతిపితను గుర్తుచేసుకుని ఆయన మన దేశం కోసం చేసిన సేవలను తలచుకొని భక్తి భావంతో పూజలు చేస్తారు. అయితే కమెడియన్ రాహుల్ రామకృష్ణ మాత్రం సోషల్ మీడియా వేదికగా గాంధీజీ గొప్పవారని నేను అనుకోలేదు అంటూ సంచలనమైన ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ గా మారడంతో ఓ నేటిజన్ తనదైన స్టైల్ లో గట్టిగా కౌంటర్ ఇచ్చారు.నేడు గాంధీ జయంతి కావడంతో ఎక్కడ మద్యం దొరకక రాహుల్ రామకృష్ణకు పిచ్చి లేసినట్టు ఉంది అందుకే పిచ్చికూతలు కూస్తున్నాడు అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.ఇలా పలువురు నెటిజన్లు ఒక్కసారిగా దాడి చేయడంతో దెబ్బకు రాహుల్ రామకృష్ణ చేసిన ఈ ట్వీట్ డిలీట్ చేశారు.