పూజా హెగ్డే కెరియర్ మొదట్లో పలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చినటువంటి అరవింద సమేత చిత్రం ద్వారా ఈమె మంచి హిట్ అందుకున్నారు. ఇలా వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు అందుకున్నటువంటి పూజా హెగ్డేను ఇండస్ట్రీలో అందరూ గోల్డెన్ లెగ్ అంటూ భావించారు. అయితే ఈమె 2022వ సంవత్సరంలో ఏకంగా నాలుగు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ నాలుగు సినిమాలు స్టార్ హీరోల సినిమాలు కావడం అలాగే భారీ బడ్జెట్ సినిమాలు కావడం విశేషం.
ఇలా 2022వ సంవత్సరంలో నాలుగు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూజా హెగ్డేకు ఏ ఒక్క సినిమా కూడా హిట్ అందించలేకపోయింది. దీంతో ఈమెను అందరూ కూడా ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.అయితే ఈమె గత ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈమెకు పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో అవకాశం వచ్చింది.
ఈ సినిమాలో మొదట హీరోయిన్గా పూజ హెగ్డే అనుకున్నారు. అందుకు పూజ హెగ్డే కూడా ఓకే చెప్పింది అయితే పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో మరొకవైపు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈమెకు డేట్స్ చాలా ఇబ్బందిగా మారిపోతుందని ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇలా పూజ హెగ్డే పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకొని చాలా పెద్ద తప్పు చేశానని,ఈ సినిమా నుంచి తప్పుకోవడం నేను చేసిన పెద్ద తప్పు అంటూ తన సన్నిహితుల దగ్గర బాధపడ్డారట. ఈ సినిమా నుంచి పూజ హెగ్డే తప్పుకోవడంతో ఈమె స్థానంలో శ్రీ లీల అవకాశము దక్కించుకుందని సమాచారం.