మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఈయన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిరంజీవి కేవలం సినిమా విశేషాలు మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాలు గురించి కూడా చెబుతున్నారు.
ప్రస్తుతం ఉపాసన గర్భవతి అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి తన ప్రేగ్నెన్సీ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఉపాసన తల్లి కాబోతుందనే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే ఉపాసన రాంచరణ్ ఈ శుభవార్తను తమతో చెప్పినప్పుడు తనకు సురేఖకు సంతోషంలో కళ్ళల్లో నీళ్లు తిరిగాయని ఆ కన్నీళ్లను ఆపుకోలేకపోయానని చిరంజీవి తెలియచేశారు.
గత ఆరు సంవత్సరాల నుంచి ఈ శుభవార్త కోసం తమ కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామని ఉపాసన రాంచరణ్ ఈ విషయం చెప్పేసరికి చాలా సంతోషించామని చిరంజీవి వెల్లడించారు.ఇక ఉపాసన రాంచరణ్ ఈ విషయాన్ని వారి జపాన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మాతో పంచుకున్నారు. అయితే తనకు మూడవ నెల పూర్తి అయిన తరువాతనే అభిమానులతో ఈ శుభవార్తను పంచుకున్నామని ఈ సందర్భంగా మరోసారి చిరంజీవి తన కొడుకు కోడలు విషయంలో ఆనందాన్ని వ్యక్తం చేశారు.