సంగీత దర్శకత్వం చేయటానికి సిద్ధంగా ఉన్నాను.. తన మ్యూజిక్ డైరెక్షన్ పై క్లారిటీ ఇచ్చిన రమణ గోగుల!

హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. 2025లో సంక్రాంతి పండుగకు ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. 18 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్, మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల కాంబో మళ్లీ వస్తోంది. బ్లాక్‌బస్టర్ లక్ష్మి సినిమా కోసం వెంకటేష్‌తో కలిసి పని చేసిన రమణ గోగుల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్‌కి తన వాయిస్‌ని అందించారు. గోదారి గట్టుమీద రామచిలకవే.. గోరింటాకెట్టుకున్న చందమామవే’ అంటూ సాగే ఈ పాటకు ట్యూన్ అదిరిపోయింది.

భాస్కర భట్ల లిరిక్స్ చించి అవతలేశారు. ఇంత మంచి పాటను రెగ్యులర్ ప్లేబ్యాక్ సింగర్‌గా కాకుండా, విలక్షణమైన వాయిస్‌తో పాడించాలని దర్శకుడు అనిల్ రావిపూడి భావించారు. రమణ గోగులతో ఈ పాటను పాడించాలని సూచించారు. దాంతో రమణ గోగుల ఈ పాటని మధుప్రియ తో కలిసి పాడటం ఆ సాంగ్ సూపర్ హిట్ అవటం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ సాంగ్ గురించి రమణ గోగుల మాట్లాడుతూ నేను ఇంతవరకు వేరే వాళ్ళ మ్యూజిక్ డైరెక్షన్లో పాడలేదు.

దర్శకుడు అనిల్ రావిపూడి, మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసిరీలియో నన్ను సంప్రదించారు. అయితే వెంకటేష్ తో నాకు మంచి స్నేహం ఉంది నా మొదటి సినిమా ప్రేమంటే ఇదేరా ఆయన కాంబినేషన్ లోనే వచ్చింది. ఆ స్నేహం తోనే బాణీ పంపించమని అడిగాను. నాకు చాలా బాగా నచ్చింది, మధుప్రియ కూడా నా వాయిస్ కి తగ్గట్టు బ్యాలెన్స్డ్గా పాడింది. ఇప్పుడు ఈ పాటకి వస్తున్న రెస్పాన్స్ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పాడు రమణ గోగుల.

ఇక తన వ్యక్తిగత జీవితానికి వస్తే ప్రస్తుతం తాను అమెరికాలో ఉంటున్నట్లు, ఒక బహుళ జాతి కంపెనీలో పని చేస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటికీ తను సంగీత దర్శకత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఇప్పటి మ్యూజిక్ డైరెక్టర్లు చాలా బాగా వర్క్ చేస్తున్నారు అయినా కొత్తదనాన్ని చేరుకోవడంలో ఏదో తెలియని ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ని నా వినూత్నమైన ఆలోచనలతో ఫీల్ చేస్తాను అంటున్నాడు రమణ గోగుల.