వైరల్ : మెగా లాయల్స్ తాట తీసిన హైప్ ఆది.!

jabardasth-hyper-aadi

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న మోస్ట్ ఫ్యాన్ బేస్ సపోర్ట్ ఉన్న ఫ్యామిలీస్ లో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి. మరి మెగాస్టార్ చిరంజీవి పునాది వేసి స్టార్ట్ చేసిన ఈ కుటుంబం ఇప్పుడు కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోస్ ఒకొక్కరికి ఒకో క్రేజ్ ఉంది కానీ ఆ క్రేజ్ అంతా కూడా మెగాస్టార్ తర్వాత మాత్రమే వచ్చింది అని చెప్పాలి.

మెగాస్టార్ అనే ఒకతను లేకపోతే మిగతా పవర్ స్టార్ లు మెగా పవర్ స్టార్ లు అలాగే ఐకాన్ స్టార్ లు ఎక్కడ? అయితే వీరిలో కూడా మళ్ళీ గ్రూపులు ఉంటాయి. చిరు ని సపోర్ట్ చేస్తూ పవన్ ని తిట్టడం చరణ్ ని సపోర్ట్ చేస్తూ పవన్ చిరు లని తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎక్కువగా అయితే చిరు ని అభిమానిస్తూ పవన్ ని తిట్టే సంత ఎక్కువ ఉంటుంది.

అయితే వారికి మెగా లాయల్స్ అనే బిరుదు ఉంటుంది. అంటే వారే మెగాస్టార్ నిజమైన ఫ్యాన్స్ అని వారికి వారే ఇచ్చుకునే స్టేట్మెంట్ అది. కానీ నిన్న వారికి అసలు సిసలు మెగాస్టార్ అండ్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్ అయినటువంటి ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది “భోళా శంకర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్ గా మారుతున్నాయి.

కొంతమంది చిరుకి సపోర్ట్ చేస్తూ కళ్యాణ్ గారిని తిడుతూ ఉంటారు కానీ ఇక్కడ అన్నయ్య ఏమో తమ్ముడు మీద ఎవరైనా ఏమన్నా అంటే తట్టుకోలేరు అందుకే న్యూస్ కూడా చూడడం మానేసాను అని చెప్పారు అని అలాగే అన్నయ్యని అన్న ఏ ఒక్కరినీ కూడా పవన్ కళ్యాణ్ వదిలిపెట్టరు ఇది వీరి ఇద్దరి మధ్య ఉన్న బలమైన బంధం అంటూ హైపర్ అనాది తన స్టైల్ లో స్పీచ్ ఇచ్చాడు.

దీనితో ఈ పర్టిక్యులర్ క్లిప్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆ లాయల్ మెగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. దీనితో హైప్ ఆది స్పీచ్ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో కేజ్రీగా వైరల్ గా మారుతుంది.