ఇండస్ట్రీ టాక్ : పూజా హెగ్డే వల్ల మహేష్ సినిమాకి ఇబ్బందులు.?

ఇప్పుడు టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా సినిమా దగ్గర కూడా అనేక సినిమాలతో బిజీగా ఉంది పూజా హెగ్డే. గత కొన్నాళ్ల కితం అయితే ఒకే రోజులో మూడు నాలుగు సినిమాలు కూడా చేసిన రోజులు ఆమెకి ఉన్నాయి. మరి ఇంతలా ఈమెని బిజీ చేసింది మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ అనే చెప్పాలి.

తనతో సినిమాలు చేశాకే పూజా హెగ్డే కి భారీ ఆఫర్స్ అన్ని భాషల్లో వచ్చి పడ్డాయి. మరి ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా  పైగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో కూడా త్రివిక్రమ్ కి మూడో సినిమా కావడంతో అభిమానులు మరింత ఆసక్తిగా ఈ సినిమా విషయంలో ఉన్నారు.

అయితే ఇప్పటికే చాలా లేట్ అయ్యినటువంటి ఈ చిత్రం ఎట్టకేలకు మళ్ళీ స్టార్ట్ చేసే సమయంలో హీరోయిన్ పూజా హెగ్డే వల్ల ఆగాల్సి వచ్చినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. అయితే దీనికి కారణం కూడా తెలుస్తుంది. పూజా హెగ్డే ఇప్పుడు ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఇప్పుడు షెడ్యూల్ లో ఆమె పై సీన్స్ ఉండగా ఈ షూట్  వచ్చింది అని తెలుస్తుంది.

దీనితో ఈ డిసెంబర్ రెండో వారంలో జరగాల్సిన షూటింగ్ ఈ డిసెంబర్ చివర వరకు వెళ్లే ఛాన్స్ లేనట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే పూజా మూలాన మహేష్ సినిమాకి ఊహించని ఇబ్బంది వచ్చింది అని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.