గాసిప్స్ : విజయ్ 67వ సినిమాకి రికార్డు ఫిగర్ పలికిందా.?

తమిళ నాట భారీ క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో ఇప్పుడిప్పుడే తెలుగు లో సినిమాలతో మరింత మార్కెట్ పెంచుకుంటూ వస్తున్న హీరో దళపతి విజయ్ కూడా ఒకడు. అయితే తన క్రేజ్ అంతా కూడా మన సౌత్ ఇండియా లోనే కాకుండా ఇండియా సినిమా హీరోల్లో వేరేగా ఉంటుంది.

యూట్యూబ్ లో ఏ వీడియో చూసినా 1 మిలియన్ లైక్స్ అనేది విజయ్ సినిమా కెరీర్ లో కేక్ వాక్ అయ్యిపోయింది. ఇక ట్విట్టర్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు విజయ్ అయితే మన తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తో “వారసుడు” అనే సినిమా చేస్తుండగా దీనిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

పైగా దీని తర్వాత తన కెరీర్ లో చేసే 67 వ సినిమాపై అయితే ఎనలేని హైప్ ఉంది. ఎందుకంటే దర్శకుడు లోకేష్ కనగ రాజు చేసిన విక్రమ్ సినిమా తర్వాత అనౌన్స్ చేసిన సినిమా ఇది కావడంతో ఆ యూనివర్స్ రిలేటెడ్ ఈ చిత్రం ఉంటుందా అని ఓ రేంజ్ లో ఎగ్జైట్మెంట్ అందరిలో నెలకొంది.

అందుకే అప్పుడే ఈ సినిమాకి రికార్డు మార్క్ ఫిగర్ తో ఓటిటి డీల్ లాక్ అయ్యినట్టుగా ఇప్పుడు గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో కానీ ఈ సినిమాకి ఏకంగా 160 కోట్ల మాసివ్ అఫర్ ఈ సినిమాకి వచ్చిందట. మరి ఇది ఏ సంస్థ ఇచ్చింది అనే ఇతర అంశాలు ఇంకా క్లారిటీ లేవు కానీ ఇప్పుడు తమిళ్ మరియు తెలుగు సినిమాల్లో ఇదే టాపిక్ గా ఉంది.