పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబో మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ దాదాపు ఆగిపోయినట్లే.. అనే ప్రచారం జరిగింది. అయితే, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని పూర్తి చేసేయాలన్న ఆలోచన చేస్తున్నారట.
ఈ నిమిత్తం డైరెక్టర్ హరీష్ శంకర్ తెర వెనక వ్యవహారాలు కాస్త వేగంగా చక్కబెట్టేస్తున్నారట. పవన్ కళ్యాణ్‌కి అందుబాటులోనే షూటింగ్ కార్యక్రమాలు కానిచ్చేయాలనుకుంటున్నాడట.
మైత్రీ మూవీస్ మేకర్స్ అందుకు తగ్గ ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారట. పవన్‌తో చిత్రీకరించాల్సిన సీన్లు విజయ వాడ పరిసిసర ప్రాంతాల్లో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ అవసరం లేని సీన్లు హైద్రాబాద్‌లో చిత్రీకరించేయనున్నారట.
అలాగే, ఎక్కువ పార్ట్ షూటింగ్ సెట్స్‌లోనే కానిచ్చేయనున్నారట. మొత్తానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్‌డేట్‌పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నెలకొందని చెప్పొచ్చు.