రామ్ ‘రెడ్’ సినిమా విషయంలో డెసిషన్ మార్చుకుంటే ఎలా ..?

తమిళ సూపర్ హిట్ సినిమా తడం తెలుగు రీమేక్ ‘రెడ్’ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

First Look Poster From 'Red' Is Out

అయితే ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి దెబ్బకు పరిస్థితులన్నీ మారిపోయాయి. కాగా మంచి బజ్ క్రియోటయి ఉన్న సినిమాల కోసం మాత్రం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రామ్ రెడ్ కోసం కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాని డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేయటానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ భారీ ఆఫర్లు ఇచ్చినా.. మేకర్స్ మాత్రం సంక్రాంతికి నేరుగా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామంటూ ఆ ఆఫర్స్ ను వదులుకున్నారు. ప్రస్తుతం థియేటర్లు కూడా తెరవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే డిసెంబర్ 25 సాయి ధరం తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందని క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఈ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతుందని సమాచారం. అయితే ‘రెడ్’ పై మాత్రం ఇంకా క్లారిటీ లేకపోవడం తో కొంత కన్‌ఫ్యూజన్ నెలకొంది.

ఇక బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా పై మంచి హైప్ ఉంది. అందుకే ఈ సినిమా రిలీజ్ విషయంలో రామ్ ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని ఫిక్సైపోయాడు. చూడాలి మరి ఫైనల్ గా ఈ సినిమాని ఎలా రిలీజ్ చేయనున్నారో.