పూరి హీరోయిన్ ని సుకుమార్ ఎలా కాదంటాడు..?

పూరి జగన్నాధ్ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ తో పాటు యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో.. హీరోలు ఎంత రఫ్ అండ్ రగ్డ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. యంగ్ హీరో రాం అయినా సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అయినా తమ ఇమేజ్ ని పక్కన పెట్టి పూరి స్టైల్ లోకి మారిపోవాల్సిందే. పూరి రాసుకునే కథ పాదరసం లాంటిది. ఎలాంటి హీరోకైనా సరిపోతుంది. ఆ క్యారెక్టర్ లో పూరి ఏ హీరోనైనా తనకి నచ్చినట్టు చూపిస్తాడు. సినిమా హిట్.. ఫ్లాప్ అన్నది అటుంచితే పూరి సినిమాలో నటించిన హీరోకి ఒక కొత్త ఇమేజ్ వచ్చేస్తుంది.

Disha Patani: I love my cheat days, when I can eat anything without regrets  | Lifestyle News,The Indian Express

అయితే తన సినిమాలలో హీరోలనే కాదు హీరోయిన్స్ ని కూడా పూరి అద్భుతంగా చూపిస్తాడు. తను ఏ హీరోయిన్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసినా లైఫ్ సెటిలవ్వాల్సిందే. ఒకవేళ పూరి సినిమాలో నటించకముందు ట్రాక్ రికార్డ్ బాగాలేకపోయినా పూరి ఫేట్ మార్చేస్తాడు. అందుకు ఉదాహరణ పూరి గత చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాలో నటించిన నిధి అగర్వాల్, నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ తో స్టార్స్ గా మారిపోయారు. నభా వరసగా మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఫాం లో ఉంది. నిధి కూడా టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటుంది.

ఇక పూరి టాలీవుడ్ కి పరిచయం చేసిన బ్యూటీ దిశాపఠాని. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది. అయితే ఈ సినిమా తర్వాత తెలుగులో సినిమాలు చేయనప్పటికి బాలీవుడ్ లో మాత్రం క్రేజీ హీరోయిన్ గా పాపులారిటీని సంపాదించుకుంది. సోషల్ మీడియాలోను దిశా పఠాని ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలతో రఫ్ఫాడించేస్తుంది. అయితే సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప సినిమాలో ఒక ఐటం సాంగ్ కోసం దిశాపఠాని తీసుకోకున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

అయితే ఇది అధికారకంగా ప్రకటించలేదు. దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసే స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఆ సాంగ్ కి అల్లు అర్జున్ డాన్స్ చేస్తాడంటే ఏ హీరోయిన్ అయినా ఆసక్తిగా ఉంటుంది. అంతేకాదు దిశా పఠాని కూడా అల్లు అర్జున్ డాన్స్ మీద కామెంట్ చేసి ఆకట్టుకుంది. మరి పూరి పరిచయం చేసిన దిశాపఠాని ని సుకుమార్ తన సినిమాలో ఐటం సాగ్ కి తీసుకుంటాడా కాదంటాడా చూడాలి.